YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

మూడొందల కోట్ల బడ్జెట్ తో ఆర్ఆర్ఆర్

మూడొందల కోట్ల బడ్జెట్ తో ఆర్ఆర్ఆర్
కొన్నేళ్ల కిందటి వరకు ఇండియా అంతటా మార్కెట్ ఉన్న హిందీ సినిమాలకు వంద కోట్ల బడ్జెట్ అంటేనే ఔరా అంటూ ఆశ్చర్యపోయి చూసేవాళ్లు. కానీ ఇప్పుడు దక్షిణాదిన వందల కోట్లతో అలవోకగా సినిమాలు తీసి పారేస్తున్నారు. మన దర్శక ధీరుడు రాజమౌళి ‘బాహుబలి’ రెండు భాగాల కోసం ఏకంగా రూ.450 కోట్లు ఖర్చు పెట్టించాడు. దానికి మరెన్నో రెట్లు వసూళ్లు రాబట్టాడు. తర్వాత శంకర్ ‘2.0’ కోసం ఏకంగా రూ.545 కోట్లు బడ్జెట్ పెట్టించాడు. ఈ సినిమా పెట్టుబడిని వెనక్కి తెచ్చేలాగే కనిపిస్తోంది. ఈ సినిమాలు ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో దక్షిణాదిన మరిన్ని భారీ బడ్జెట్ సినిమాలు శ్రీకారం చుట్టుకుంటున్నాయి. రాజమౌళి తీస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ బడ్జెట్ రూ.300 కోట్ల దాకా ఉండొచ్చని వార్తలొస్తున్నారు. తాజాగా దక్షిణాదిన మరో మూడొందల కోట్ల సినిమా మొదలైంది.
విక్రమ్ హీరోగా మలయాళ దర్శకుడు ఆర్.ఎస్.విమల్ ‘మహావీర కర్ణ’ పేరుతో ఓ సినిమాకు శ్రీకారం చుట్టాడు. గత ఏడాదే ఈ సినిమాను అనౌన్స్ చేయగా.. ఇప్పుడది ప్రారంభోత్సవం జరుపుకుంది. ఏడాదికి పైగా ప్రి ప్రొడక్షన్ పనులు చేశాక ఎట్టకేలకు ఈ చిత్రానికి ప్రారంభోత్సవం జరిపారు. కేరళలోని ఒక ఆలయంలో ఈ వేడుక నిర్వహించారు. ఇందులో విక్రమ్ పాల్గొనలేదు. దర్శక నిర్మాతలే పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహాభారతంతో పాటు మరిన్ని గ్రంథాల్ని అధ్యయనం చేసి కర్ణుడి పాత్రను పరిపూర్ణంగా తెరపైన ఆవిష్కరించబోతున్నారట. మలయాళం.. తమిళం.. తెలుగు.. హిందీ సహా పదికి పైగా భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారట. బడ్జెట్ రూ.300 కోట్లను దాటొచ్చని అంటున్నారు. ఈ పాత్ర కోసం విక్రమ్ కొన్ని నెలలుగా సిద్ధమవుతున్నాడు. కర్ణుడి పాత్ర కోసం భారీ అవతారంలోకి మారబోతున్నాడట అతను. యునైటెడ్ కింగ్ డమ్ ఫిలిమ్స్ అనే విదేశీ సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతోంది

Related Posts