YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్ధి నగదు స్వాధీనం

కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్ధి నగదు స్వాధీనం
సికింద్రాబాద్  కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణకు చెందిన భారీ నగదును  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సర్వే సత్యనారాయణ ప్రధాన అనుచరుడు కాంగ్రెస్ నేత గాలి బాలాజీ నుంచి రూ. 50 లక్షలు,  కాంగ్రెస్ ప్రచార సామగ్రిని టాస్క్ ఫోర్స్ పోలీసులు  స్వాధీనం చేసుకున్నారు.  బాలాజీ గురువారం ఉదయం ఏపీ 09 బీఏ  4646 ఇన్నోవా వాహనంలో సర్వే సత్యనారాయణ కోసం డబ్బులు తీసుకెళ్తుండగా నాంపల్లి దగ్గర పట్టుకున్నారు. సర్వే అదేశాల మేరకు బేగం బజార్లోని హవాలా డీలర్ దిలీప్ నుంచి నగును తీసుకుని వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మరో ఘటనలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి షార్జా వెళుతున్న ఒక మహిళ బ్యాగులో 28 లక్షల 50 వేల విదేశీ కరెన్సీ ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తదుపి .విచారణ నిమిత్తం డిఆర్ఐ అధికారులకు అప్పగించారు. 

Related Posts