YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

119 నియోజకవర్గాలు..1821 మంది అభ్యర్థుల పోటీ 32,815 కేంద్రాల్లో పోలింగ్, లక్షా 60 వేల మంది సిబ్బంది

119 నియోజకవర్గాలు..1821 మంది అభ్యర్థుల పోటీ 32,815 కేంద్రాల్లో పోలింగ్, లక్షా 60 వేల మంది సిబ్బంది

మరి కాసేపట్లో జరిగే తెలంగాణ శాసనసభ ఎన్నికలకు అంతా సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 32,815 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల కమీషన్ వెల్లడించింది. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 3,873 పోలింగ్ కేంద్రాలు, అత్యల్పంగా వనపర్తి జిల్లాలో 280 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల విధుల కోసం 1,60,509 మంది సిబ్బందిని కేటాయించారు. 55,329 బ్యాలెట్ యూనిట్లు, 42,751 వీవీ ప్యాట్ లను వినియోగిస్తున్నారు. 39,763 కంట్రోల్ యూనిట్లు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల విధుల్లో 649 మంది సహాయక రిటర్నింగ్ అధికారులు ఉండనున్నారు. 4,57,809 మంది దివ్యాంగ ఓటర్ల కోసం వివిధ ఏర్పాట్లు చేశారు. దివ్యాంగుల కోసం 31 జిల్లాల్లో 29,541 వాలంటీర్లను అందుబాటులో ఉంచారు.  ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. సమస్యాత్మకమైన 13 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ జరగనుంది. ఫలితాలు డిసెంబర్ 11న విడుదల కానున్నాయి.119 నియోజకవర్గాలకు 1,821 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని ఎన్నికల కమిషన్ పేర్కొంది. 15 మంది అభ్యర్థులకు పైగా పోటీ చేస్తున్న నియోజకవర్గాలు 25, 16-31 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాలు 78, 32 అంతకుమించి అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాలు 16 అని ఎన్నికల కమిషన్ తెలిపింది. మల్కాజ్ గిరిలో అత్యధికంగా 42 మంది, బాన్సువాడలో అత్యల్పంగా ఆరుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 2,80,64,684 మంది ఓటర్లు ఉన్నారు. పురుషులు - 1,41,56,182, మహిళలు - 1,39,05,811 కాగా ఇతరులు 2,691 మంది ఉన్నారు.

Related Posts