YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

జిల్లాలో ఐదు సఖి పోలింగ్ కేంద్రాలు

జిల్లాలో ఐదు సఖి పోలింగ్ కేంద్రాలు

ఎన్నికల పోలింగ్‌కు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ నెల 7న రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ జరుగనున్న విషయం తెలిసిందే. దీంతో ఎన్నికలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లాలోని మద్యం, కల్లు దుకాణాలకు పలు ఆంక్షలను విధించా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు ఓ ప్రకటన జారీ చేస్తూ ఈ నెల 7న పోలింగ్ జరుగనున్నందున ఈ నెల 5న సాయంత్రం 6 గంటల నుంచి 7వ తేదీ (పోలింగ్ రోజు) సాయంత్రం 6 గంటల వరకు జిల్లాలోని అన్ని మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలు, కల్లు డిపోలను మూసివేశారు. అదేవిధంగా ఓట్ల లెక్కింపు సందర్భంగా ఈ నెల 11న జిల్లాలోని అన్ని మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలు, కల్లు డిపోలను మూసివేయాలని స్పష్టం చేశారు. లేని యెడల ఎవరు ఆదేశాలను ఉల్లంఘించినా చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.  జిల్లాలో మొత్తం 1,479 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఒక్కో నియోజకవర్గంలో ప్రత్యేక మహిళా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సఖి పోలింగ్ కేంద్రంగా పిలువబడుతున్న ఒక్కో పోలింగ్ కేంద్రంలో దాదాపు వెయ్యి మంది చొప్పున మహిళా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో మొత్తం 5 సఖి కేంద్రాలను ఏర్పాటు చేయగా పోలింగ్ స్టేషన్ల వారీగా ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Related Posts