YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

త్వరలో ‘పతంజలి ఫుడ్ పార్క్’ ప్రాజెక్టు పనులు.. ముఖ్యమంత్రితో భేటీలో బాబా రాందేవ్ వెల్లడి

త్వరలో ‘పతంజలి ఫుడ్ పార్క్’ ప్రాజెక్టు పనులు.. ముఖ్యమంత్రితో భేటీలో బాబా రాందేవ్ వెల్లడి

యోగా గురు బాబా రాందేవ్కు చెందిన  ‘పతంజలి ఫుడ్ అండ్ హెర్బల్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ రాష్ట్రంలో ‘మెగా ఫుడ్ పార్క్’ను త్వరలో ప్రారంభించనుంది. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చిన్నారావుపల్లిలో ఈ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. 

  ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును గురువారం సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రాందేవ్ ‘మెగా ఫుడ్ పార్క్’ విశేషాలను వివరించారు. మొత్తం రూ. 634 కోట్లతో అత్యాధునిక ఆహార శుద్ధి పరిశ్రమతో పాటు వివిధ అనుబంధ యూనిట్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ మెగా ప్రాజెక్టుతో 33,400 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కలుగుతుందని చెప్పారు. ‘మెగా ఫుడ్ పార్క్’కు 172.84 ఎకరాలు కేటాయించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి బాబా రాందేవ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాజెక్టును ‘పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్’ సంస్థ పర్యవేక్షణలో ఏర్పాటు కానుందని చెప్పారు. 

  రాష్ట్రంలో పెద్దఎత్తున పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని బాబా రాందేవ్తో ముఖ్యమంత్రి అన్నారు. రసాయన పురుగుమందులు లేకుండా వ్యవసాయ ఉత్పత్తులు సాధించే దిశగా కృషి చేస్తున్నామని వెల్లడించారు. కోటి ఎకరాల్లో సూక్ష్మసేద్యం, కోటి ఎకరాల్లో ఉద్యానవనాల సాగు తమ లక్ష్యమని చెప్పారు. 

అత్యాధునిక ఆహార శుద్ధి కేంద్రం

  బార్లీ, వరి, నువ్వులు, జొన్న, మొక్కజొన్న, దానిమ్మ, బొప్పాయి, మామిడి, మిర్చి, అల్లం, వెల్లుల్లి, ఉల్లి, బఠానీ, బంగాళాదుంప, పసుపు, కందులు, మినుములు, చిరుధాన్యాలను ఈ మెగా ఫుడ్ పార్కులో శుద్ధి చేస్తారు. కోల్డ్ స్టోరేజ్తో పాటు, డ్రై వేర్హౌస్, డ్రయింగ్, గ్రైండింగ్, గ్రేడింగ్ ప్యాకింగ్, ప్రీ కూలింగ్ ప్లాంట్లు ప్రాజెక్టులో భాగంగా ఉంటాయి. ప్రధానంగా రోజుకు 1500 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన పళ్ల రసాలు తయారీ యూనిట్ను రూ. 45.20 కోట్లతో ఏర్పాటు చేస్తారు. బిస్కట్లు, నూడిల్స్, మసాలా దినుసుల శుద్ధి, కూరగాయల శీతలీకరణకు సంబంధించిన యూనిట్లు కూడా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి.

Related Posts