YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పటిష్ట ఏర్పాట్లు

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పటిష్ట ఏర్పాట్లు

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికలు సజావుగా జరిగేందుకు పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి మావోయిస్టులు రాకుండా ఉండేందుకు మంచిర్యాల, పెద్దపల్లి జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టిపెట్టారు. ఇక ఓటర్లను ప్రభావితం చేసేందుకు మద్యం, డబ్బు పంపిణీ చేసేవారిపైన ఉక్కుపాదం మోపుతున్నారు. గత రెండు రోజుల్లోనే లక్షలాది రూపాయలు స్వాధీనం చేసుకున్నామని రామగుండం పోలీస్‌కమిషనర్ సత్యనారాయణ తెలిపారు.ఎన్నికలు బాయికాట్ చేయాలంటూ మావోయిస్టుల పిలుపునిచ్చిన నేథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పూర్తి స్థాయిలో భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు. సుమారు 4 వేల మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాలు, కాళేశ్వరం సమీపంలో మంథని నియోజకవర్గంలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లు సత్యనారాయణ చెప్పారు. రెండు, మూడు సంవత్సరాలుగా మావోయిస్టు కదలికలు ఎక్కడా లేవన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర సాయుధ బలగాల పహారాతో భద్రత ఉంటుందని తెలిపారు. మద్యం, డబ్బు పంపిణీచేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలిస్ కమిషనర్ సత్యనారాయణ హెచ్చరించారు.

Related Posts