YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

జూనియర్ ఎన్టీఆర్ నా అన్న హరికృష్ణకే కొడుకు కాదు.నాకు కొడుకే: బాలకృష్ణ.!

జూనియర్ ఎన్టీఆర్ నా అన్న హరికృష్ణకే కొడుకు కాదు.నాకు కొడుకే: బాలకృష్ణ.!

మహాకూటమి పొత్తులో భాగంగా కూకట్ పల్లి నియోజక వర్గం నుండి పోటీ చేస్తున్న టీడీపీ నేత నందమూరి సుహాసిని తరుపున నందమూరి కుటుంబం నుండి పలువులు ప్రచారం పాల్గొంటున్నారు.నందమూరి తారక్ రత్న ,నందమూరి కళ్యాణ్ రామ్ సతీమణి ,బాలకృష్ణ తదితరులు రోడ్ షో లో భాగంగా ఇంటి ఇంటికి తీరుగుతున్నారు.

బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ పై తాను ఇలాంటి కామెంట్స్ ఎందుకు చేయవలిసి వచ్చింది అనే అంశాన్ని వివరిస్తూ..జీవితం లో రాజకీయాలు వేరు, సినిమాలు వేరు ఈ విషయాన్ని నేను మా నాన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వద్ద నుండి నేర్చుకున్నాను అని చెప్పుకు వస్తూ కూకట్ పల్లి నుండి పోటీకి దిగిన సుహాసిని తరుపున ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ రావలిచిన అవసరం లేదు.

ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడిప్పుడే సినిమా పరిశ్రమలో అంచెలంచెలు ఎదుగుతూ వస్తున్నారు.ఇలాంటి సమయం లో జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారానికి వస్తే కొంతమంది వ్యతిరేకంగా మారె అవకాశం ఉంది అంటూ అందులోను జూనియర్ ఎన్టీఆర్ కు ఎన్నికల ప్రచారం అంతగా కలిసిరాలేదు.

ఆ భయం తోనే నేను జూనియర్ ఎన్టీఆర్ ను ప్రచారానికి రావద్దు అన్నాను అని చెప్తూ..ఈ విషయం జూనియర్ ఎన్టీఆర్ నా అన్న హరికృష్ణ కొడుకు కాదు.నా కొడుకే అందుకే ఎన్నికల ప్రచారానికి రానివ్వలేదు.నా కొడుకు మోక్షజ్ఞ ఎన్నికల ప్రచారానికి ఎందుకు రాలేదో ..జూనియర్ ఎన్టీఆర్ కూడా అందుకే రాలేదు.

నేను ఇప్పటికే ఎమ్మెల్యే గా ఉన్నాను.సినిమా పరిశ్రమలో స్టార్ డమ్ మొత్తం చూసేసాను.అందుకే రాజకీయాలు ,సినిమాలు రెండు బ్యాలన్స్ చేయగలుగుతున్నాను.రాజకీయాలలో సుహాసినిది నాది ఒక్కటే మార్గం.జూనియర్ ఎన్టీఆర్ ,కళ్యాణ్ రామ్ ,మోక్షజ్ఞ ది ఒకటే మార్గం అందుకే మేము వేరు వాళ్ళు వేరు అంటూ జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితి గురించి బాలకృష్ణ చాలా వివరంగా చెప్పడం విశేషం .

Related Posts