YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

కామ్రేడ్ లో రష్మిక

కామ్రేడ్ లో రష్మిక
ప్రస్తుతం టాలీవుడ్‌లో ప్రస్తుతం మోస్ట్ పాపులర్ స్టార్ విజయ్ దేవరకొండ అనడంలో సందేహం లేదు. పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి, గీతగోవిందం, టాక్సీవాలా.. ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న విజయ్ ప్రస్తుతం ‘డియర్ కామ్రేడ్’లో నటిస్తున్నాడు. గీతగోవిందం కోస్టార్ రష్మికతో మరోసారి స్క్రీన్ పంచుకుంటున్నాడు. ఇందులో స్టూడెంట్ పాత్రలో విజయ్ నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత విజయ్... క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నటించనున్నాడు. ఇందులో హీరోయిన్‌గా ఇద్దరమ్మాయిలతో, పైసా, సరైనోడు చిత్రాల్లో నటించిన కేథరిన్‌ను తీసుకోనున్నారట. కేథరిన్ చివరిగా ‘నేనే రాజు.. నేనే మంత్రి’లో నటించింది. అప్పటినుంచి మరో తెలుగు సినిమాకు సంతకం చేయలేదు. క్రాంతి మాధవ్ చెప్పిన స్టోరీ లైన్ నచ్చడంతో ఈ అమ్మడు ఓకే చెప్పేసిందట. విజయ్, కేథరిన్ జంట ఈ చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్ తెస్తుందని దర్శకుడి ఆలోచనట. ఇదే జరిగితే కేథరిన్ తెలుగులో మళ్లీ బిజీగా మారే అవకాశం ఉందని సినీవర్గాలు అంటున్నాయి. 

Related Posts