YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రైల్వే స్టేషన్ లో పార్కింగ్ ఛార్జీల మోత

 రైల్వే స్టేషన్ లో పార్కింగ్ ఛార్జీల మోత
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పార్కింగ్ ఛార్జీల మోతమోగుతుంది. ప్రీమియం పేరుతో గంట గంటకు పార్కింగ్ ఛార్జీలు వసూల్ చేస్తూ వాహనదారుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. పెరిగిన ఛార్జీలతో వాహనాలు పార్క్ చేయాలంటేనే వాహదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి.దక్షిణమధ్య రైల్వే పరిధిలోని ఎక్కడ లేని విధంగా సికింద్రాబాద్ లో పార్కింగ్ ఛార్జీలను వసూల్ చేయడం పై ప్రయాణికులు మండిపడుతున్నారు.సికింద్రాబాద్ స్టేషన్లలో పార్కింగ్ రుసుముల భారం అధికంగా ఉందని వాహనదారులు వాపోతున్నారు. బుకింగ్ కౌంటర్లు వంటి ప్రధాన ప్రాంతాలకు దగ్గర్లో 'ప్రీమియం'పార్కింగ్ పేరుతో అధిక రుసుములు వసూలుచేస్తున్నారు. ఇక్కడ గంటగంటకు రుసుం వసూలుచేస్తున్నారు. మిగిలినచోట్ల కనీస వ్యవధి రెండు గంటలుగా నిర్ణయించినా ఇక్కడ రూ.15వరకు తీసుకుంటున్నారు. కార్లకైతే రైల్వేస్టేషన్లను బట్టి కనీసఛార్జీ రూ.40-50వరకు నిర్ణయించారు. వేలం పద్ధతిలో పార్కింగ్ లైసెన్సుల్ని రైల్వేశాఖ మంజూరుచేస్తోంది. ఆ మొత్తాన్ని రాబట్టుకోవడంతో పాటు అధిక లాభాలకు గుత్తేదారులు కోరినవిధంగా రుసుములు పెంచుతోందని ప్రయాణికులు వాపోతున్నారు. పార్కింగ్ ఛార్జీలతో పాటు  వస్తుసేవల పన్ను భారం అదనం చేల్లించల్సిందే. గతంలో సర్వీసుట్యాక్సు ఉన్నప్పుడు పార్కింగ్ ఛార్జీ మాత్రమే ఉండేది. జీఎస్టీ వచ్చాక వాహనపార్కింగ్పై 18శాతం పన్ను వసూలుచేస్తున్నారు.సికింద్రాబాద్ స్టేషన్ ప్రధానప్రాంతంలో ద్విచక్రవాహనాలకు సంబంధించి రెండు ప్రీమియం పార్కింగ్లున్నాయి. వీటిలో ఒకదానికి ఏడాదికి రూ.75లక్షల వరకు రైల్వేశాఖకు ఆదాయం వస్తున్నట్లు సమాచారం. ఇక్కడ గంటకు రూ.10వసూలుచేస్తారు. ఆపై జీఎస్టీ రూ.2.. గంట దాటి పది, పదిహేను నిమిషాలు దాటినా రూ.24చెల్లించాల్సిందే. కారుకు కనీసం రూ.40. జీఎస్టీ రూ.8. రెండుగంటల వరకు రూ.48. ఆపై దాటితే ప్రతి రెండుగంటలకు మరో రూ.24చొప్పున చెల్లించాలి.ఇక్కడ రుసుం తక్కువ. రోజూ వాహనాన్ని పార్కు చేసేవారికి రూ.700 నెలవారీ పాస్ సదుపాయం ఉందిసికింద్రాబాద్లోనే రేతిఫైల్ బస్స్టేషన్ పక్కనే రిజర్వేషన్ కేంద్రంలో ఓ పార్కింగ్ స్థలం ఉంది. కనీసం రుసుం రూ.15. జీఎస్టీ రూ.3. ఇదేమి రద్దీప్రాంతం కాకపోయినా ఛార్జీలు మాత్రం అధికంగా వసూల్ చేస్తున్నారు. వాహనాలు తక్కువ వస్తున్నాయని గుత్తేదారుకు ప్రయోజనం కల్గించేలా ఛార్జీ పెంచినట్లు తెలుస్తోంది. ఇక్కడ 24 గంటలు టూ వీలర్ ను పార్కింగ్ చేస్తే అక్షరాల 425 రూపాయాలు చెల్లించాల్సిందే. సదరు వాహనాదారుడు ఎందుకు ఇంత చెల్లించాలి అని అంటే వారితో దాడికి దిగిన ఘటనలు కుడా ఇక్కడ అనేకం జరిగాయి. వాహనాల్లో వచ్చినవాళ్లు వెంటనే తిరిగి వెళ్లేందుకే అధిక రుసుములతో ప్రీమియం పార్కింగ్కు అనుమతించమని రైల్వే శాఖ అధికారులు చేప్తున్నారు.. టికెట్ కంటే పార్కింగ్ రుసుం అధికంగా వసూల్ చేస్తున్నారని వాహదారులు మండిపడ్డుతున్నారు.  సికింద్రాబాద్ వంటి పెద్దస్టేషన్ల నుంచి దగ్గరల్లోని పట్టణాలకు ఉద్యోగాల కోసం నిత్యం వేలాదిమంది రాకపోకలు సాగిస్తుంటారు. రైలు టికెట్ కంటే పార్కింగ్ ఛార్జీ అధికం ఉండడాని వారు జీర్ణిచుకోలేకపోతున్నారు.. ఇష్టానుసారంగా పార్కింగ్ ఛార్జీలను వసూల్ చేస్తుంటే ...రైల్వే శాఖ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వాహానాదారులు డిమాండ్ చేస్తున్నారు.టెండర్ విధానంలో లైసెన్స్ కేటాయించడంతో గుత్తేదారులు భారీగా రుసుం వసూలుచేస్తున్నారు. రైల్వే శాఖకు ప్రయాణికుల సౌకర్యం కంటే ఆదామే ముఖ్యం అనట్లుగా వ్యవహరిస్తుందని ప్రయాణికులు మండిపడ్డుతున్నారు. ఇప్పటికైన రైల్వే శాఖ పార్కింగ్ ఛార్జీల విషయంలో చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు

Related Posts