YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రెట్టింపైన ఫించన్లు

రెట్టింపైన ఫించన్లు

పింఛన్‌దారులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త చెప్పారు. సంక్రాత్రి కానుకగా పింఛన్లు రూ.వెయ్యి నుంచి రూ.2వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. జనవరి నుంచే పెంచిన పింఛన్ చెల్లిస్తామన్నారు. జనవరికి సంబంధించిన పెన్షన్ ఇప్పటికే పంపిణీ చేశారు కాబట్టి.. పెంచిన పింఛన్ ఫిబ్రవరిలో అందజేస్తామని తెలిపారు. నెల్లూరు జిల్లా బోగోలు జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. ఈ ప్రకటన చేశారు. తాజా నిర్ణయంతో సుమారు 50లక్షల మందికిపైగా పింఛన్ దారులకు లబ్ది జరుగుతుంది. 2014కు ముందు పింఛన్ నెలకు రూ.200మాత్రమే. టీడీపీ అధికారంలోకి వచ్చాక నెలకు రూ.1000కి పెంపు చేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల పింఛన్లు కలిపి దాదాపు 50,61,906 మందికి పంపిణీ అవుతున్నాయి. వీటిపై నెలకి రూ.560కోట్లు చొప్పున ఏడాదికి రూ.6,720కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. అన్నిరకాల పింఛన్ల మొత్తాన్ని రెట్టింపు చేస్తే నెలకి రూ.1,120కోట్లు.. ఏడాదికి రూ.13,440కోట్లు చొప్పున వెచ్చించాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. తాజా జన్మభూమి గ్రామ సభల్లో తొమ్మిదో తేదీ నాటికి పింఛన్ల కోసం మరో 1.05లక్షల దరఖాస్తులందాయట. వివిధ రూపాల్లో అందిన విజ్ఞప్తులతో కలిపి.. దాదాపు 4.55లక్షల కొత్త పింఛన్లు మంజూరయ్యే వీలుందట. 

Related Posts