YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సిటీలో ఓట్ల కోసం 8 లక్షల దరఖాస్తులు

సిటీలో ఓట్ల కోసం 8 లక్షల దరఖాస్తులు
తెలంగాణలో ఈ ఏడాది చేపట్టిన ఓటర్ల నమోదు ప్రక్రియలో కొత్తగా 8 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ తెలిపారు.  ప్రతి ఏడాది జనవరి 1వ తేదీ నుంచి కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను పూర్తి చేసి నూతన ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటిస్తుందని తెలిపారు. ఈ ఏడాది మన రాష్ట్రంలో నూతన ఓటర్ల జాబితాను ప్రకటించామని వెల్లడించారు. ఓటర్ల తొలగింపు కోసం 10వేల దరఖాస్తులు వచ్చాయని వివరించారు. జవవరి 25వరకూ ఓటరు నమోదుకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. ఫిబ్రవరి 25వ తేదీన తుది ఓటరు జాబితాను ప్రచురిస్తామని  వెల్లడించారు.తుది జాబితా ముద్రణ తర్వాత డబుల్ ఓట్లు కూడా తొలగించడం సాధ్యం కాదన్నారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓటర్ల జాబితి విషయంలో ఎక్కువ ఆరోపణలు వచ్చాయని, అలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎన్నికలకు ముందు ఓటరు జాబితాలో పేరు సరిచూసుకోవడం పౌరుల బాధ్యత అని అన్నారు. హైదరాబాద్ పరిధిలో 6లక్షల ఓట్ల తొలగింపు జరిగింది. ఎన్నికలకు ముందు ఓటరు జాబితాలో పేరు సరిచూసుకోవడం కూడా పౌరుల బాధ్యత అని రజత్‌కుమార్  అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఓట్ల తొలగింపుపై హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల పోలింగు నాడు 20లక్షల ఓట్లు తొలగించినట్లు ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోసాయి.దీంతో ఓట్ల తొలగింపు అంశం కీలకంగా మారింది.

Related Posts