YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జగన్ పై సింపతీ కోసమే చేశా

జగన్ పై సింపతీ కోసమే చేశా

జగన్ పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్ ఆరు రోజుల విచారణలో ఎన్ఐఏ కు ఒకే సమాధానమిచ్చాడు. జగన్ పై దాడి చేస్తే అతనికి సానుభూతి పెరిగి వచ్చే ఎన్నికల్లో సిఎం అవుతాడన్న ఉద్దేశ్యంతోనే అలా చేసినట్లు శ్రీనివాస్ చెబుతున్నాడు. ఎన్ ఐఏ అధికారులు విడివిడిగా అనేకరకాలుగా ప్రశ్నించినా శ్రీనివాస్ నుంచి వచ్చిన సమాధానం ఒక్కటే. ఇందులో కుట్ర లేదని, తన వెనక ఎవరూ లేరని స్పష్టం చేశాడు శ్రీనివాస్.శ్రీనివాస్ ను కస్టడీకి తీసుకున్నాక ఎన్ ఐఏ అధికారులు విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన ఘటనపై సీన్ ను రీ కన్ స్ట్ట్రక్షన్ చేశారు. జగన్ పై ఎలా దాడి చేసింది శ్రీనివాస్ అధికారులకు చూపించాడు. అదంతా వీడియో రికార్డ్ చేశారు అధికారులు. ఆతర్వాత హైదరాబాద్ లోని ఎన్ఐఏ కార్యాలయానికి శ్రీనివాస్ ను తరలించారు. ఐదు రోజుల పాటు ఆఫీసులోనే నిందితుణ్ని విచారించారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఐజి అలోక్ మిట్టల్ కూడా శ్రీనివాస్ ను ప్రశ్నించారు. విశాఖ పోలీసుల వద్ద పేర్కొన్న అంశాల్నే శ్రీనివాస్ ఎన్ఐఏ ముందు రిపీట్ చేశాడు. కొత్త అంశమేమీ లేదు. మరోవైపు తాను రాసుకున్న 24 పేజీల లేఖను తనకు ఇప్పించాలంటూ అధికారులను కోరుతున్నాడు శ్రీనివాస్. అందులో అన్ని అంశాలను పేర్కొన్నట్లు చెబుతున్నాడు. ఇక విచారణ పూర్తికావడంతో.. శ్రీనివాస్ ను విజయవాడకు తరలిస్తారు. అక్కడి కోర్టుల్లో నిందితుడ్ని హాజరుపరుస్తారు. 7 రోజుల కస్టడీ పూర్తి కావడంతో.. కోర్టు ముందు ఉంచబోయే కస్టడీ రిపోర్టులో విచారణ అంశాలన్నీ పొందుపరుస్తున్నారు. అయితే శ్రీనివాస్ ను మరోమారు కస్టడీ కోరతారా? లేదా? అనేది చూడాలి. ఇక విశాఖ ఎయిర్ పోర్ట్ లోని క్యాంటిన్ ఓనర్ హర్షవర్దన్ తో పాటు శ్రీనివాస్ తో ఫోన్లో మాట్లాడిన 10 మంది మహిళల పాత్ర ఏంటి అన్న దానిపైనా ఆరా తీస్తున్నారు ఎన్ఐఏ అధికారులు

Related Posts