YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రక్షణ రంగంలో ప్రైవేటీకరణ వద్దు

రక్షణ రంగంలో ప్రైవేటీకరణ వద్దు

డిఫెన్స్ ఇండస్ట్రీలో ప్రయివేటికరణకు వ్యతిరేకంగా కార్మికుల సమ్మె జరగనుంది. ఈనెల 23 నుండి 25 వరకు నాలుగు సంఘాలకు చెందిన 4లక్షల మంది కార్మికులు సమ్మెకు  దిగనున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం అయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ రంగంలో డిఫెన్స్ చాలా పెద్ద ఇండస్ట్రీ. కేంద్రం నిర్ణయం దేశ రక్షణకు ఇది చాలా ముప్పు. కార్మికుల సమ్మెకు సీపీఐ మద్దతు ఇస్తుందని అయన అన్నారు. సీబీఐ నుంచి ఆలోక్ వర్మ ట్రాన్స్ఫర్ చాలా దారుణం.ఇది తొందరపాటు చర్య. ఈ ట్రాన్స్ఫర్ మోదీ కక్షపురితంగా చేశారని అయన ఆరోపించారు. ఆలోక్ విషయంలో పారదర్శకంగా విచారణ జరగాలి. ప్రధాని కేరళలో కమ్యూనిస్టులపై చేసిన వ్యాఖలను ఖండిస్తున్నామని అన్నారు. మోదీ పూర్తిగా బాధ్యత రహితమైన వ్యాఖ్యలు చేయడం దారుణం. సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా మోదీ కేరళలో మాట్లాడడం సిగ్గుచేటు. జేఎన్యూ  విద్యార్థులపై అక్రమంగా నమోదు చేసిన చార్జిషీట్ వెనక్కి తీసుకోవాలని అన్నారు. కాశ్మీర్ విషయంలోనే కాదు, మనువాదం నుండి, బ్రహ్మణవాదం నుండి అజాదీ కావాలి. విద్యార్థులపై చేసే ఆరోపణలన్నీ నిరాధారమైనవి. దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయలకోసం కూటములు కడితే తప్పేముందని అయన ప్రశ్నించారు. ఫెడరల్ ఫ్రాంట్ పేరుతో బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చే ప్రయత్నం  కేసీఆర్ చేస్తున్నారని అయన విమర్శించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. టిఆర్ఎస్ నుండి ఫిరాయిస్తే ఒకలా, టిఆర్ఎస్ లోకి వెళ్తే ఒక న్యాయం ఉండడమేంటి? కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్సీలను టిఆర్ఎస్ లో చేర్చుకొని విలీనం చేయడం పద్దతి కాదు. కొందరు టిఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరారని ఫిర్యాదు అందగానే ఆఘమేఘాల పై చర్యలు తీసుకోవడం పక్షపాతం కదాని అన్నారు. నూతన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి శుభాకాంక్షలు.  శాసన సభలను ఔన్నత్యంగా నడపాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వ దూకుడును గమనిస్తున్నామని అన్నారు. కేసీఆర్ ఫ్రాంట్ బీజేపీ లబ్ది కొరకే. కేసీఆర్ ప్రజలను ఎన్ని రోజులు మాటలతో మభ్య పెడతారని చాడా అన్నారు.

Related Posts