YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రాజమండ్రి జైలుకు జగన్ కేసు నిందితుడు

రాజమండ్రి జైలుకు జగన్ కేసు నిందితుడు

వైకాపా అధినేత జగన్ పై దాడి నిందితుడు శ్రీనివాసరావును శుక్రవారం  విజయవాడ ఎన్ఐయే కోర్టులో హాజరుపరిచారు.  జగన్పై దాడి కేసును దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గత శనివారం అతడిని అధీనంలోకి తీసుకుంది.  ఆదివారం అతడిని హైదరాబాద్ కు తీసుకుని వచ్చి, పలు దఫాలుగా ప్రశ్నించింది.  ఎన్ఐఏ ప్రశ్నలకు నిందితుడు ఒకే ఒక్క సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది.  జగన్ పై  సానుభూతి కోసమే దాడి చేశానని, ఇందులో ఎటువంటి కుట్ర లేదని పదేపదే చెప్పినట్టు తెలుస్తోంది.  నిందితుడుని అదుపులోకి తీసుకున్న తర్వాత అతడిని పలు కోణాల్లో అధికారులు విచారించారు.  విద్యాభ్యాసం, తల్లిదండ్రులు, విమానాశ్రయ క్యాంటీన్ లో ఉద్యోగం, స్నేహితులు, దాడికి ఉపయోగించిన కత్తి  తదితర వాటిపై ప్రశ్నలు సంధించారు.  అధికారులు ఎన్నిమార్లు ప్రశ్నించినా అతడు మాత్రం మౌనంగానే ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే, జైలులో శ్రీనివాసరావు రాసిన 25 పేజీల లేఖను కూడా దర్యాప్తు అధికారులు పరిశీలించినట్లు సమాచారం.  శుక్రవారం నాడు కేసు కీలక మలుపు తిరుగింది. నిందితుడు శ్రీనివాస్ తరపు న్యాయవాది సలీం శ్రీనివాస్ ను విజయవాడ సబ్ జైల్ కు   తరలించవద్దని  పిటిషన్ దాఖలు చేసారు. విజయవాడ జైల్ లో శ్రీనివాస్ కు రక్షణ లేదు. వైజాగ్, రాజమండ్రి సెంట్రల్ జైలు కి తరలించాలని  పిటిషన్ లో పేర్కోన్నారు. ఎన్ఐఎ నిబంధనలు ఉల్లంఘించిందని  లాయర్ సలీం కోర్టుకు తెలిపారు. తమకు తెలియకుండా శ్రీనివాసరావును 30 గంటలపాటు ఎన్ఐఎ అధికారులు విచారించారని న్యాయవాది చెప్పారు. శ్రీనివాస్ కుడా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కోర్టుకు విన్నవించుకున్నాడు.. . జగన్ పై ఎందుకు దాడి చేశానో జైలులో ఉన్నప్పుడు 22 పేజీల పుస్తకం రాశానని అన్నాడు.  ఆ పుస్తకాన్ని జైలు అధికారులు లాక్కున్నారని అతడు చెప్పాడు. .  తనకు ప్రజలతో మాట్లాడే అవకాశం ఇవ్వాలని న్యాయమూర్తిని కోరాడు. అసలు ఈ దాడి ఎందుకు చేయాల్సి వచ్చిందో తాను ప్రజలకు చెబుతానని వ్యాఖ్యానించాడు. నిందితుడి తరఫు న్యాయవాది వాదనను కోర్టు అంగీకరించింది. భద్రత మధ్య శ్రీనివాస్ను రాజమండ్రి జైలుకు తరలించాలని ఆదేశించింది. 22 పేజీల పుస్తకాన్ని శ్రీనివాస్ కు  ఇవ్వడానికి ఎన్ఐఎ న్యాయస్థానం తిరస్కరించింది. అంతకుముందు నిందితుడు శ్రీనివాసరావుకు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. శుక్రవారం ఉదయం శ్రీనివాస్ ను  ఎన్ఐఏ అధికారులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వచ్చారు. వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

Related Posts