YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

టిఆర్ఎస్ లో చేరిన ఒంటేరు ప్రతాప్ రెడ్డి ప్రజల కోసం అనేక పోరాటాలు చేశా

టిఆర్ఎస్ లో చేరిన ఒంటేరు ప్రతాప్ రెడ్డి       ప్రజల కోసం అనేక పోరాటాలు చేశా

కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ భవన్ లో ఒంటేరుకు కండువా కప్పి కేటిఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. భారీ అనుచరగణంతో ఒంటేరు ప్రతాప్ రెడ్డి టిఆర్ఎస్ భవన్ కు తరలి వచ్చారు. ఈ సందర్భంగా  ఒంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ“నేను ప్రజల కోసం అనేక పోరాటాలు చేశాను. మల్లన్న సాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టుల కోసం రైతుల పక్షాన నిలబడ్డాను. అయినా కూడా ప్రజలు కేసీఆర్ నే నమ్మారు. ప్రజలంతా కేసీఆర్ వైపు ఉన్నారు. సంక్షేమ పథకాలతో కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకోగలిగారు. రైతు బంధు, రైతు బీమా, పింఛన్ల పెంపు ప్రజలను బాగా ప్రభావితం చేశాయి. అందుకే కేసీఆర్ భారీ మెజార్టీతో గెలిచారు. సీఎం గారు తీసుకున్న నిర్ణయం కరెక్టు అని, నేను తీసుకున్న నిర్ణయం తప్పు అని ప్రజలు ఆలోచించారు. అందుకే నేను కూడా సీఎం గారి నుంచి వచ్చిన ఆహ్వానం మేరకు టిఆర్ ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నాను. పదవులు, డబ్బుల కోసం నేను ఏనాడు ఆలోచించలేదు. నా క్యాడర్ కూడా నా వెంటే ఉంది. నేను పార్టీలు మారినా క్యాడర్ నన్ను విడిచి పెట్టలేదు. టిడిపిలో ఉన్నా కాంగ్రెస్ లో ఉన్నా వారు నాకు సహకరించారు. కేసీఆర్ అనే వ్యక్తిని చూసే ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అందుకే కాంగ్రెస్ ను గెలిపించలేదు. ప్రజలంతా కేసీఆర్ వైపే నిలిచారు. ప్రజల నాడీని పట్టుకోవడంలో కాంగ్రెస్ విఫలమైంది. గ్రూపు రాజకీయాలు కూడా కాంగ్రెస్ ను దెబ్బతీశాయి. ఎప్పటికైనా గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలవాలనేది తన కోరిక. అవినీతికి, గూండాయిజానికి నేను ఎప్పుడు దూరంగానే ఉన్నాను.మెదక్ ఎంపీ నా గురించి ఏం మాట్లాడారో నాకు తెలియదు. ఏ పార్టీలో నేను పని చేసినా ఆ పార్టీ అధినేతలే నా బాస్ లు. ఇప్పుడు కేసిఆర్ నా బాస్. కేసిఆర్ నుంచి వచ్చిన ఆహ్వానం మేరకే నేను టిఆర్ ఎస్ లో చేరుతున్నాను. నా క్యాడర్ కూడా నాతో పాటు వస్తుంది. కేసీఆర్ ఏ బాధ్యతలు అప్పగించినా ప్రజా క్షేమం కోసం బాధ్యతగా నిర్వర్తిస్తాను. ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నేతలంతా తనకు సహకరించారు. నాకు ఎవరి పైనా ద్వేషం లేదు.” అని ప్రతాప్ రెడ్డి అన్నారు.

Related Posts