YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

హాట్ టాపిక్ గా టీడీపీ, కాంగ్రెస్ పొత్తు

హాట్ టాపిక్ గా టీడీపీ, కాంగ్రెస్ పొత్తు

తెలుగుదేశం పార్టీ-కాంగ్రెస్ పొత్తు వ్యవహారం కొద్ది రోజులుగా హాట్ టాపిక్ అవుతోంది. బద్ధ శత్రువులుగా ఉన్న ఈ రెండు పార్టీలు తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికలకు ముందు కలిశాయి. అప్పటి నుంచి ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అయింది. అదేవిధంగా జాతీయ స్థాయిలోనూ సంచలనం అయింది. ఆ సమయంలో టీడీపీ-కాంగ్రెస్ స్నేహ బంధంపై సర్వత్రా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయినా.. ఈ పార్టీలు మరో రెండు పార్టీలతో కలిసి ప్రజాకూటమిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన కూటమి ఓటమి పాలైంది. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ చేసి, కేవలం 21 నియోజకవర్గాల్లో మాత్రమే విజయం సాధించాయి. ఈ ఫలితాల ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్‌పైనా పడింది. దీనికి కారణం కాంగ్రెస్-తెలుగుదేశం పార్టీలు ఏపీలోనూ పోటీలో ఉండడమే. దీనికితోడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ప్రకటించడమూ ఏపీ ఎన్నికలపై ఆసక్తిని రెట్టింపు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో టీడీపీ-కాంగ్రెస్ మధ్య పొత్తు ఉంటుందా..? లేదా అనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై కొంత స్పష్టత వచ్చినప్పటికీ, తాజాగా మరో క్లారిటీ వచ్చేసింది.తెలంగాణలో టీడీపీ పొత్తు కోసం పాకులాడితే.. ఏపీలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆ పాత్రను తీసుకుంది. అందుకే ఆ పార్టీలోని చాలా మంది సీనియర్లు సైకిల్ పార్టీతో పొత్తును కోరుకుంటున్నారు. అందుకే ఇటీవల జరిగిన చంద్రబాబు.. రాహుల్ గాంధీ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే, ఆ భేటీలో ఏపీలో పొత్తులపై వీళ్లిద్దరి మధ్యా ఎటువంటి చర్చ జరగలేదు. దీంతో ఇక, ఏపీలో పొత్తు లేనట్లేనని అందరూ ఒక అంచనాకు వచ్చేశారు. అయితే, తాజాగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, కుటుంబపెద్ద సోనియాగాంధీలకు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన పళ్లంరాజు టీడీపీతో కాంగ్రెస్‌కి పొత్తులేదని తేల్చేశారు. పళ్లంరాజు గత కేంద్ర కేబినెట్‌లో కీలకమైన రక్షణశాఖ మంత్రి పదవి నిర్వహించారు. పళ్లంరాజు కుటుంబానికి, ఇందిరాగాంధీ కుటుంబానికి మూడు తరాల అనుబంధం ఉంది. పళ్లంరాజు కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు సైతం ఎటువంటి రాజకీయ వివాదాస్పదమైన ప్రకటనలు ఇచ్చేవారు కాదు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో మాట్లాడిన తర్వాతే రాష్ట్రంలో టీడీపీతో పొత్తులేదన్న అంశంలో పళ్లంరాజు స్పష్టత ఇచ్చి ఉంటారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. టీడీపీతో పొత్తు ఉంటే.. కాకినాడ లోక్‌సభ నుంచి పళ్లంరాజు పొత్తులో భాగంగా కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తారని ఇన్నాళ్లూ ఊహాగానాలు సాగాయి. పొత్తులేదని ఆయనే స్వయంగా తేల్చేయడంతో ఇక అన్ని స్థానాలలోనూ టీడీపీ విడిగా పోటీ చేసే అవకాశం కన్పిస్తోంది.

Related Posts