YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నల్గొండలో ఎన్నికల సందడి

నల్గొండలో ఎన్నికల సందడి

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ముందెన్నడు లేని రీతిలో సర్పంచ్‌ల ఏకగ్రీవ ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. మొదటి విడతలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 90సర్పంచ్ స్థానాలు, 1188వార్డు స్థానాలు ఏకగ్రీవమవ్వగా, రెండో విడతలో 97సర్పంచ్ స్థానాలు, 990వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవమైన వాటిలో అధికార టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన సర్పంచ్‌లే మెజార్టీగా ఉన్నారు. చిన్న పంచాయతీలు, తండాల్లో ఏకగ్రీవాలు అధికంగా సాగగా ఎక్కువగా డబ్బుతో పాటు భవిష్యత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశాల కల్పన హామీలతో పాటు ఊరి అభివృద్ధికి నిధులిస్తామంటు ఒప్పందాల నేపధ్యంలోనే సర్పంచ్, వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. సంపన్న వర్గాలకు చెందిన వారే పంచాయతీ పోరులోను, ఏకగ్రీవాల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించినట్లుగా తెలుస్తుంది. 500ఓట్లు ఉన్న తండాలు, చిన్న పంచాయతీల్లోనూ 10నుండి 20లక్షల మేరకు గ్రామాభివృద్ధికి ఖర్చు చేస్తామన్న హామీలతో సర్పంచ్ పదవులు దక్కించుకున్నట్లుగా ప్రచారం సాగుతుంది. ఎన్నికలు జరుగుతున్న పంచాయతీల్లో సైతం రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా సాగే పంచాయతీల పరిధిలో సర్పంచ్ స్థానాలకు లక్షలు దాటి కోట్లు ఖర్చు చేసే దిశగా సాగుతున్న పంచాయతీ ఎన్నికల హోరాహోరీకి నిదర్శనంగా కనిపిస్తుంది.

 సోమవారం మొదటి విడత పోలింగ్

మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఈనెల 21న నిర్వహించనున్నారు. మొదటి విడతలో నల్లగొండ జిల్లాలో 52 సర్పంచ్‌లు, 655 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఎన్నికలు జరుగుతున్న 52సర్పంచ్ స్థానాలకు 666మంది, 1914వార్డులకు 4281మంది బరిలో ఉన్నారు. సూర్యాపేట జిల్లాలో 16సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా, 292వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఎన్నికలు జరుగుతున్న 145 సర్పంచ్ స్థానాలకు 426మంది అభ్యర్థులు, 1162వార్డు స్థానాలకు 2574మంది పోటీలో ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 22మంది సర్పంచ్‌లు ఏకగ్రీవంకాగా, 241వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఎన్నికలు జరుగుతున్న 102సర్పంచ్ స్థానాలకు 298మంది అభ్యర్థులు, 809 వార్డు స్థానాలకు 1944మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

రెండో విడత పోలింగ్ ఈనెల 25న జరుగనుండగా, నల్లగొండ జిల్లాలో దేవరకొండ డివిజన్‌లోఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడతలో 52సర్పంచ్ స్థానాలు, 585 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఎన్నికలు జరుగుతున్న 224సర్పంచ్‌లకు 678మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 1786వార్డులకు 4125 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సూర్యాపేట జిల్లాలో 29 సర్పంచ్ స్థానాలు, 250వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 131సర్పంచ్ స్థానాల్లో 345మంది, 1212వార్డు స్థానాలకు 2669 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండో విడతలో 16 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా 113 సర్పంచ్ స్థానాలకు, 999 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి.

Related Posts