YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో ఎన్నికలపై లీకులు..

ఏపీలో ఎన్నికలపై  లీకులు..

మార్చి మొదటి వారంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. 6,7 దశల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఈసీ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. లోక్‌సభతో పాటు ఏపీ, అరుణాచల్‌ప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నట్లు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. 16వ లోక్‌సభ పదవీకాలం జూన్ 3తో ముగియనుంది. ఈ లోపే ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తి కావాల్సి ఉంది. దీంతో స్పీడ్ పెంచిన ఎన్నికల కమిషన్ మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయాలని భావిస్తోంది. కాగా.. ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు సంబంధించిన సీఈవోలతో పలుమార్లు సమావేశాలు నిర్వహించిన ఈసీ ఫైనల్‌గా ఈ నిర్ణయానికొచ్చింది.అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని సీఈవోలకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిపిన చర్చల్లో సమస్యలన్నీ కూడా ఓ కొలిక్కి తెచ్చే ప్రయాత్నాలు చేయడం జరిగింది. ప్రస్తుతం ఎంతమంది భద్రతా సిబ్బంది ఉన్నారు? వారిని వినియోగించుకుంటూ ఎన్ని దశల్లో పోలింగ్ నిర్వహించవచ్చు? అధికారుల మార్పులు, చేర్పులతో పాటు పలు అంశాలపై సమావేశంలో ఎన్నికల కమిషన్ చర్చించినట్లుగా తెలుస్తోంది. 2014లో మాదిరిగానే అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించే వీలుంది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌‌ ప్రదేశ్‌ల‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి నిర్వహించే అవకాశాలు కన్పిస్తున్నాయి.జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలను సార్వత్రిక ఎన్నికలతో నిర్వహించడంపై ఈసీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 2019లోకి అడుగుపెట్టడంతో ఆంధ్రప్రదేశ్‌‌లో పొలిటికల్ హీట్ మరింత పెరిగిందనే చెప్పుకోవచ్చు. ఏపీలోని రాజకీయ పార్టీలకు ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నాయి. కాగా.. 2014లో ఎన్నికల షెడ్యూల్‌ను మార్చి 5న ప్రకటించారు. ఏప్రిల్, మే నెలల్లో 9 దశల్లో ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారిగా గోపాలకృష్ణ ద్వివేదిని నియమిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఆయనకు ఎలాంటి అదనపు బాధ్యతలు అప్పగించరాదని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఏపీ ప్రధాన ఎన్నికల అధికారిగా ఉన్న సిసోడియాను ఆకస్మికంగా బదిలీ చేసి.. ఆయన స్థానంలో గోపాలకృష్ణ ద్వివేదిని నియమిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.

Related Posts