YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అట్టహసంగా బెలూన్ల పండగ

అట్టహసంగా బెలూన్ల పండగ
విశాఖ జిల్లా అరకులో బెలూన్ ఫేస్టివల్ ఘనంగా నడుస్తోంది. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రారంభమైన బెలూన్ ఫెస్టివల్ లో 15 దేశాలకు చెందిన ఔత్సాహికులు 20 హాట్ ఎయిర్ బెలూన్లతో అలరించారు.ఈ బెలూన్ ఫ్టెస్టివల్ ను వీక్షించేందుకు భారీగా పర్యాటకులు రావడంతో సందడి వాతావరణం నెలకొంది. ఇంతవరకు ఉత్తర భారత దేశానికే పరిమితమై న హాట్ బెలూన్ ఫెస్టివల్ పర్యాటక ప్రాంతమైన అరుకులో నిర్వహించడంతో పర్యాటకులు సంతోషం వ్యకం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 15 దేశాల నుంచి ప్రతినిదులు వచ్చారు.రెండేళ్ల నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో, గతేడాది కర్ణాటకలోని హంపి, మైసూర్, బీదర్‌లలో ఆయా రాష్ట్రాల పర్యాటకాభివృద్ధి సంస్థలు ఈ ఫెస్ట్‌ను నిర్వహించాయి.అంతటి ప్రాముఖ్యత సంతరించుకున్న బెలూన్ ఫ్టేస్టివల్ విశాఖ ఏజెన్సీలో నిర్వహించ డంతో పర్యాటకులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. బెలూన్ల పండుగ నిర్వహణకు ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేశారు.దీంతో స్థానికులు పర్యాటకు లు ఏర్పాట్లను తిలకించేందుకు భారీగా పర్యాటకులు తరలి వచ్చారు.వాతావరణం పండుగ నిర్వహణ కు అనుకూలంగా ఉండటంతో బెలూన్ ఫెస్టివల్ పర్యాటకుల ఫుల్ జోష్ మద్య కొనసాగుతోంది.

Related Posts