YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

హైద్రాబాద్ లో సిమ్ స్వాప్ మోసం

హైద్రాబాద్ లో సిమ్ స్వాప్ మోసం
మరోకొత్త రకం ఆర్థిక మోసం ఒకటి బయటపడింది. అదే సిమ్ స్వాప్ మోసం. మోసగాళ్లు ఈ విధానం ద్వారా ముంబైకి చెందిన ఒక వ్యాపారవేత్త నుంచి రూ.1.86 కోట్లు కొట్టేశారు. సబ్‌స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్ (సిమ్) స్వాప్ ఫ్రాడ్‌ను బంద్రా కుర్లా కాంప్లెక్స్ సైబర్ పోలీసులు కూడా ద్రువీకరించారు. మీకు ఈ అంశం ఆశ్చర్యంగానే ఉండొచ్చు. కానీ జరిగింది. సిమ్ స్వాప్ మోసం ఏంటో చూద్దాం.. మీ వద్ద 3జీ సిమ్ కార్డు ఉంది. మీరు 4 జీ సిమ్ కార్డుకు అప్‌గ్రేడ్ అవ్వాలని అనుకుంటున్నారు. ఇలాంటి సందర్భంలో ఏంచేస్తాం? సర్వీస్ ప్రొవైడర్ దగ్గరి నుంచి 3జీ సిమ్‌ను 4జీ సిమ్‌కు అప్‌గ్రేడ్ చేసుకుంటాం. అంటే కొత్త సిమ్ కార్డు తీసుకుంటాం. దీన్నే సిమ్ స్వాప్ అని పిలుస్తారు. 4జీ సిమ్ కార్డు తీసుకోవాలంటే సర్వీస్ ప్రొవైడర్‌కు రిక్వెస్ట్ పెట్టాలి. అప్పడు సర్వీస్ ప్రొవైడర్ పాత సిమ్ కార్డును డీయాక్టివేట్ చేసి, కొత్త సిమ్ కార్డు ఇస్తుంది. కొత్త సిమ్ కొన్ని గంటల్లోగా యాక్టివేట్ అవుతుంది. మోసగాళ్లు సిమ్ స్వాప్ విధానంలో మీ సిమ్ కార్డును బ్లాక్ చేసి కొత్త సిమ్ తీసుకొని ఆర్థిక వివరాల సాయంతో బ్యాంక్ ఖాతా నుంచి డబ్బుల్ని కొట్టేస్తున్నారు. మీ నెంబర్ మీద మీ సర్వీస్ ప్రొవైడర్ దగ్గరి నుంచి కొత్త సిమ్ కార్డు తీసుకుంటారు. కొత్త సిమ్ తీసుకున్నారంటే మీ ఓటీపీ, కార్డు సంబంధిత అలర్టులు, ఆర్థిక సమాచారం వంటివి మోసగాళ్ల చేతికి వెళ్లిపోయినట్లే. వీటి సాయంతో వాళ్లు మోసాలకు పాల్పడతారు. మోసగాళ్లు మీకు హానికరమైన ట్రోజన్స్, మాల్వేర్‌ సాయంతో మీ మొబైల్ నెంబర్‌ను, బ్యాంక్ ఖాతా వివరాలు తెలుసుకుంటారు. తర్వాత సర్వీస్ ప్రొవైడర్ ఏజెంట్ అని మీకు కాల్ చేస్తారు. మీ వివరాలు కోరతారు. చాలా మంది ఏం ఆలోచించకుండానే వివరాలు చెప్పేస్తారు. అప్పుడు మోసగాళ్లు సర్వీస్ ప్రొవైడర్‌ను సంప్రదిస్తారు. మీ వివరాలతో ఫేక్ పేపర్లతో సిమ్ స్వాప్ రిక్వెస్ట్ పెడతారు. వెరిఫికేషన్ తర్వాత పాత సిమ్ కార్డు పనిచేయడం ఆగిపోతుంది. అది మన దగ్గర ఉంటుంది. కొత్త సిమ్ మోసగాళ్ల వద్ద ఉంటుంది. అప్పుడు ఎస్ఎంఎస్‌లు, ఓటీపీ, ఇతర ఫైనాన్షియల్ అలర్టులు మోసగాళ్ల చేతికి వెళ్తాయి. వీటి సాయంతో మీ బ్యాంక్ ఖాతా నుంచి డబ్బుల్ని కొట్టేస్తారు. ‘మోసగాళ్లు ఈమెయిల్స్, మాల్వేర్, ట్రోజన్స్ సాయంతో తొలిగా బ్యాంక్ వివరాలు తెలుసుకుంటారు. తర్వాత సిమ్ స్వాప్ విధానంతో సిమ్ కార్డును బ్లాక్ చేస్తారు’ అని ఇండియాఫోరెన్సిక్.ఇన్ సీఈవో మయూర్ జోషి తెలిపారు. పాస్‌వర్డ్ కఠినంగా ఉండేలా చూసుకోండి. ఈమెయిల్ అటాచ్‌మెంట్లు, లింక్‌లపై క్లిక్ చేసేటప్పుడు జాగ్రత్త. ఉచిత వైఫైలు, పబ్లిక్ కంప్యూటర్లలో ఆర్థిక లావాదేవీలు నిర్వహించొద్దు. సామాజిక మాధ్యమాల్లో ఏం షేరు చేస్తున్నారో గమనించండి. మీకు ఎవరన్నా ఫోన్ చేసి సున్నితమైన సమాచారాన్ని కోరితే ఇవ్వొద్దు. సిమ్ కార్డు పనిచేయడం ఆగిపోయిన వెంటనే సర్వీస్ ప్రొవైడర్‌ను సంప్రదించండి. ఆలస్యం చేయవద్దు. 

Related Posts