YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

టోల్ ఫ్రీ ద్వారా పిర్యాదులు, సలహాలు

టోల్ ఫ్రీ ద్వారా పిర్యాదులు, సలహాలు
ఎన్నికల కమిషన్ ఆదేశాలను అమలు చేయాడానికి శనివారం కలెక్టరేట్ లోటెలిఫోన్ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు తో  టోల్ ఫ్రీ నెంబర్ 1950 ఏర్పాటుగురించి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జె పాటిల్ చర్చించారు. ఫిక్సెడ్ ల్యాండ్ లైన్ కు 1950 ను అనుసంధానం చేసి , ఆటోమాటిక్ గా రికార్డ్ చేసే సదుపాయాన్ని కల్పించాలనిచెప్పారు.1950 ద్వారా ఓటర్ ఫిర్యాదులు, సలహాలు,సూచనలు, ఫీడ్ బ్యాక్ లను సేకరించనున్నట్లు తెలిపారు.  ఈ నె ల 21 న మొదటి దశలో గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డ్ సభ్యుల ఎన్నికకు ఓటు వేయుటకు అనువుగా ధర్మాసాగర్, ఐనవోలు, వేలేరు మండలాల్లోనిప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ మరియు ప్రవేట్ సంస్థ కు లోకల్ హాలిడే ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జె పాటిల్ ఉత్తర్వులు జారీచేశారు.ఉద్యోగులు , కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ప్రకారం లోకల్ హాలిడే గా పాటించాలని తెలిపారు. అలాగే ఆయా గ్రామ పంచాయితీ లలో ఓటర్లుగా ఉండి, ఓటు వేసేందుకు ఆశక్తి ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొంత సమయాన్ని విధుల నుండి వెసులుబాటుకల్పించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ ఎస్. దయానంద్, డి ఐ సి అధికారి విజయకుమార్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు కిరణ్ ప్రకాష్, బి.ఎస్.ఎన్ ఎల్., ఎయిర్టెల్, టాటా,రిలయన్స్, ఐడియా తదితర కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Related Posts