YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

 ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  జన్మదిన వేడుకలను ఈ నెల 17 వ తేదీన జలవిహార్ లో అత్యంత ఘనంగా, పండుగ వాతావరణం లో నిర్వహించనున్నట్లు మాజీమంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. జన్మదిన వేడుకల వేదిక జలవిహార్ లో సోమవారం ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా 17 వ తేదీన ఉదయం 9.00 గంటలకు సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో గణపతి హోమం, ఆయుష్ హోమం, ఛండీ హోమం లు నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం పద్మారావు నగర్ డివిజన్ పరిధిలోని హమాలీ బస్తీలో హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందని, జలవిహార్ లో తెలంగాణ సంస్కృతి, కళలను ప్రతిబింబించేలా గుస్సాడీ, చిందు యక్షగానం తదితర కళాకారుల తో వివిధ సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు జానపదగీతాల పోటీలను కూడా నిర్వహిస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు, షాదీముబారక్, కళ్యాణ లక్ష్మీ, ఆసరా పెన్షన్లు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ,  తదితర పథకాలను వివరించే స్టాల్స్ ను జలవిహార్ లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి తెలిపే రెండు అద్భుత గీతాలు ఆవిష్కరించడం జరుగుతుంది అన్నారు. ఇవేకాకుండా కేసీఆర్  జీవిత నేపద్యాన్ని తెలియజేసేలా భారీ ఫోటో ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 4 సంవత్సరాల3 నెలల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో కి తీసుకెళ్లి దేశంలో నే తెలంగాణ రాష్ట్రం కు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్ జన్మదినాన్ని కోలాహలంగా, పండుగ వాతావరణం లో నిర్వహిస్తామని చెప్పారు. ఈ వేడుకలకు తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  కల్వకుంట్ల తారక రామారావు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, ముఖ్య నాయకులు హరీష్ రావు, జీహెచ్ ఎంసీ పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ లు,  తెరాస  పార్టీ  నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో హాజరవుతారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ,  నం సైతం కాదంబరి కిరణ్, తెరాస  పార్టీ నాయకులు గుర్రం పవన్ కుమార్ గౌడ్, సామా ప్రభాకర్ రెడ్డి, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, ఆకుల హరికృష్ణ, బాలరాజ్ యాదవ్, సురేష్ గౌడ్, బాబురావు, శైలేందర్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts