YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడుకు క్లీన్ ‘యూ’.. ఫిబ్రవరి 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల..

ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడుకు క్లీన్ ‘యూ’.. ఫిబ్రవరి 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల..

యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:  

నంద‌మూరి బాల‌కృష్ణ‌, విద్యాబాల‌న్ జంట‌గా న‌టించిన సినిమా ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు. ఎన్టీఆర్ బ‌యోపిక్ లో రెండో భాగంగా వ‌స్తున్న‌ ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ నుంచి క్లీన్ ‘యూ’ స‌ర్టిఫికేట్ అందుకుంది ఈ చిత్రం. ఫిబ్ర‌వ‌రి 22న భారీ అంచ‌నాల మ‌ధ్య ప్ర‌పంచ వ్యాప్తంగా ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు సినిమా విడుద‌ల కానుంది. ఎన్టీఆర్ గారి రాజ‌కీయ జీవితం నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్, రానా ద‌గ్గుపాటి, సుమంత్ ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. క్రిష్ జాగ‌ర్ల‌మూడి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌గా.. ఎంఎం కీర‌వాణి సంగీతం అందించారు. నంద‌మూరి బాల‌కృష్ణ ఎన్బీకే ఫిల్మ్స్ బ్యాన‌ర్ పై ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు సినిమాను నిర్మించారు. 
నటీనటులు:
నందమూరి బాలకృష్ణ, విద్యాబాలన్, నందమూరి కళ్యాణ్ రామ్, రానా దగ్గుపాటి.. 

Related Posts