YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూత

దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూత

యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:

దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూశారు. హైదరాబాద్, గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ మరణించారు. కోడి రామకృష్ణ మృతిపై తెలుగు సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. వందకు పైగా చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.  కొంత కాలంగా శ్వాసకోశవ్యాధితో ఆయన బాధపడుతున్నారు.
       ఆయన తొలి చిత్రం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య.  మంగమ్మ గారి మనవడు, గూఢచారి నం.1, ఆహుతి, శత్రువు, తలంబ్రాలు, భారతంలో బాల చంద్రుడు, స్టేషన్ మాస్టర్, అమ్మోరు, దేవి, దేవుళ్లు, అంజి, దేవీపుత్రుడు, అరుంధతి తదితర చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.

Related Posts