YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

వైసీపీ గూటికి శివాజీరాజా?

వైసీపీ గూటికి శివాజీరాజా?

యువ్ న్యూస్ ఫిలిం బ్యూరో:

మూవీ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు, ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైన శివాజీరాజా రాజకీయ రంగప్రవేశం చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈనెల 24వ తేదీన వైసీపీ అధినేత జగన్‌ నర్సాపురం లోక్‌సభ స్థానంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జగన్‌ను కలిసి ఆయన వైసీపీ కండువా కప్పుకుంటారని భావిస్తున్నారు. ఇటీవల జరిగిన మా అధ్యక్ష ఎన్నికల్లో  ఆయన నరేష్‌పై ఓడిపోయిన విషయం తెలిసిందే. ఎన్నికలు ముగిసిన తర్వాత మాట్లాడిన శివాజీరాజా త్వరలోనే నాగబాబుకు రిటర్న్‌ గిప్ట్‌ ఇస్తానని చాలెంజ్‌ కూడా చేశారు. ఈ నేపథ్యంలో జనసేన తరపున నాగబాబు నర్సాపురం నుంచి పోటీ చేస్తున్న తరుణంలో ప్రచారంలో ఆయనకు వ్యతిరేకంగా శివాజీరాజాను వినియోగించుకోవాలని వైసీపీ భావిస్తున్నట్లు సమాచారం. 

Related Posts