YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సేఫ్ సిటీగా హైద్రాబాద్

 సేఫ్ సిటీగా హైద్రాబాద్

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

హైదరాబాద్‌కు సీసీ కెమెరాలు రక్షణ కవచంగా మారుతున్నాయి.. సీసీ కెమెరాలు ఉన్న ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో నేరాలు తగ్గుముఖం పట్టగా.. సీసీ కెమెరాలు ఎక్కువగా లేని ప్రాం తాల్లో కొద్దిమేర ఎక్కువగానే జరుగుతున్నాయి. అయి తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నగరంలో శాంతి భద్రతలు భేషుగా ఉండడంతో ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఉంటున్నారు. దీంతోనే మెర్సర్ సర్వేలో ఐదోసారి హైదరాబాద్ నగరం... దేశంలోనే ఉత్తమ ప్రమాణాలు కల్గి, నివాసయోగ్యమైన నగరాల్లో మొదటి స్థానాన్ని సాధించింది. ఇందులో ప్రధానమైంది శాంతి భద్రతలేననే విషయం అందరికీ తెలిసిందే. ప్రశాంతమైన శాంతి భద్రతలు హైదరాబాద్‌లో ఉండడంతో దేశంలోని వివిధ రాష్ర్టాల ప్రజలతో పాటు ఇతర దేశాల వారు కూడా హైదరాబాద్‌లో సేఫ్ అండ్ సెక్యూరిటీని చూసి... ఇక్కడ ఉండేందుకు మక్కువ చూపుతున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ పోలీసులు నేను సైతం కార్యక్రమం ద్వారా ప్రజలను చైతన్యపరుస్తూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నారు. జరుగుతున్న మార్పులను గుర్తించి, ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ప్రజలను కోరుతున్నారు. గతంలో ఒకే రోజు 10 చైన్ స్నాచింగ్‌లు జరిగే పరిస్థితి ఉండేది.. నేడు ఆ పరిస్థితి లో పూర్తిగా మార్పు వచ్చింది. ఒక్క స్నాచింగ్ ఘటనకు కూడా తావులేకుండా చేయాలనే లక్ష్యంతో హైదరాబాద్ పోలీసులు ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగానే టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్, అదనపు డీసీపీ చైతన్యకుమార్ నేతృత్వంలోని టాస్క్‌ఫోర్స్ బృందాలు స్నాచర్లపై నిరంతరం నిఘా పెడుతున్నాయి. దీంతో ఎక్కడ స్నాచింగ్ ఘటన జరిగినా టాస్క్‌ఫోర్స్ బృందాలు, ఆ ఘటన మూలాలపై ఆరా తీస్తున్నారు. కానిస్టేబుల్ స్థాయి నుంచి డీసీపీ స్థాయి వరకు ఉన్న అధికారులను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ప్రోత్సహిస్తుండడంతో నేరస్తుల ఆటకట్టించేందుకు అం దరూ సమష్టిగా కృషి చేస్తున్నారు. 

Related Posts