YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

15 జిల్లాల్లోనే వాటర్ సేఫ్

 15 జిల్లాల్లోనే వాటర్ సేఫ్

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

భూగర్భ జలం రోజురోజుకీ అడుగంటిపోతున్నది. చాలా ప్రాంతాల్లో 300 ఫీట్ల లోతుకు బోర్లు వేసినా నీటిజాడ దొరకని పరిస్థితి నెలకొంది.  రాష్ట్రంలో 15 జిల్లాలు మాత్రమే సురక్షిత జోన్‌లో ఉన్నాయి. ఈ జిల్లాల్లోనూ కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోవడం వేగంగా జరుగుతున్నది. 11 జిల్లాలు సంక్షిష్ట జోన్‌లో ఉన్నాయి. వరంగల్‌ అర్బన్‌, జనగామ, మేడ్చల్‌-మల్కాజిగిరి, సిద్దిపేట జిల్లాలు ప్రమాదక పరిస్థితిలో ఉన్నాయి. కాంక్రీట్‌ జంగిల్‌గా మారిన మన హైదరాబాద్‌ మహానగరం అత్యంత ప్రమాద భరిత జోన్‌లో ఉండటం ఆందో ళన కలిగిస్తున్నది. సాధారణంగా భూగర్భ జలాల నీటిమట్టాలను అంచనా వేయడానికి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో 1971లో 2314 పరిశీలనా బావులను ఎంపికచేశారు. 1917లో భూగర్భ జలాల సగటు నీటి మట్టం 10.97 ఉంది. నేడు అది మరో 12.53 అడుగులకు పడిపోయింది. 2019 జనవరి లెక్కల ప్రకారం తెలంగాణలో 966 పరిశీలనా ప్రాంతాల్లో పిజోమీటర్‌ ద్వారా భూగర్భ నీటి మట్టాలను సేకరించారు. నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లిలో గతేడాది కంటే 0.48 అడుగులకు నీటిమట్టం పడిపోగా...అదే జిల్లా మర్రిగూడెం మండలంలో 66.63 మీటర్ల గ్రౌండ్‌లెవల్‌ వాటర్‌ పడిపోయింది.నల్లగొండ, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌ జిల్లాల పరిధిలో 700అడుగుల లోతు తవ్వినా నీళ్లు లభించని దుస్థితి ఏర్పడింది. గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది 1.56మీటర్ల అడుగుకు భూగర్భజలాలు పడిపోయా యి. నీరు అడుగుకు పడిపోతున్నకొద్దీ ఫ్లోరైడ్‌ శాత మూ పెరుగుతున్నది. ఇట్లాగే పరిస్థితి కొనసాగితే భవిష్యత్‌ తరాలకు తీవ్ర ఇబ్బంది అయ్యే అవకాశము న్నదని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నా రు. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పాటు విచ్చలవిడిగా బోర్లు వేయడం, అడవులను నరికివే యడం, చెరువులు ఆక్రమణకు గురికావడం, ప్రభు త్వాల నిర్లక్ష్యంతో ఈ పరిస్థితికి కారణమంటున్నారు.రాష్ట్ర భూగర్బజల శాఖ 2013-14 నివేదికల ప్రకారం తెలంగాణలో 14.75 లక్షల బోర్లు ఉండేవి. విచ్చలవిడిగా బోర్లు వేయటం పెరిగిపోతుండటంతో 2006లో వాల్టా చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం 250 మీటర్ల లోపు బోరు ఉంటే కొత్తగా బోరు వేయొద్దని నిబంధన ఉంది. కానీ, ఈ నిబంధన బుట్టదాఖలు అవుతున్నది. తెలంగాణ వచ్చాక బోర్లు విచ్చలవిడిగా పెరిగిపోయాయి. ఈ ఐదేండ్ల కాలంలో కొత్తగా ఏడు లక్షల బోర్లు వేశారు. మొత్తంగా చూస్తే తెలంగాణలో ప్రస్తుతం 22 లక్షలకుపైగా బోర్లు ఉన్నాయి. ఏటేటా బోర్ల తవ్వకాలు పెరిగిపోవటం కూడా భూగర్భ జలాలు పడిపోవడానికి ఒక కారణమని అధికారులు చెబుతున్నారు. నీటి కోసం కొన్ని ప్రాంతాల్లో 300 నుంచి 600 ఫీట్ల వరకు బోర్లు వేస్తున్నారు. అంత లోతుల్లో ఉండే నీటి నిల్వల్లో ఫ్లోరైడ్‌ శాతం కూడా ఎక్కువగా ఉండే ప్రమాదముంది. నీటినిల్వలు అత్యంత ప్రమాదస్థితికి పడిపోయిన 1048 గ్రామాల్లో కొత్తగా బోర్లు వేయనీయకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం కింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కానీ, క్షేత్రస్థాయిలో యథేచ్ఛగా బోర్లు వేస్తున్నా పట్టించుకోవడం లేదు.ఈసారి తగినంత మోతాదులో వర్షాలు కురువ కపోవడంతో ఈ వేసవిలో భూగర్భ నీటిమట్టాలు వేగంగా పడిపోతున్నాయి. రాష్ట్ర భూగర్బ జల శాఖ నివేదిక ప్రకారం రాష్ట్రంలోని 18 జిల్లాల్లో భూగర్భ జలాలు వేగంగా అడుగంటిపోతున్నాయి. 5 మీటర్ల నుంచి 10 మీటర్లలోతుకు నీటిమట్టాలు పడిపో యిన ప్రాంతం తెలంగాణలో 36 శాతం ఉంది. 18.2 శాతం భూభాగంలో 15 నుంచి 20 మీటర్ల లోతుకు నీటి నిల్వలు పడిపోయాయి. 13 శాతం భూభాగంలో 20 మీటర్లకు లోతుకు పడిపో యాయి. దక్షిణ, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో భూగర్భ జలాలు వేగంగా లోతుకు పడిపోతు న్నాయి. సంగారెడ్డి జిల్లాలో గతం కంటే 7.49 మీటర్ల లోతులోకి నీటినిల్వలు పడిపోయాయి. ఆ జిల్లాలో 45 శాతం లోటు వర్షపాతం నమోదైంది. దీంతో క్రమంగా భూగర్భజలాలు కూడా ఈ వేసవిలో వేగంగా తగ్గుతున్నాయి. ప్రతిఏటా వర్షం ద్వారా లభ్యమయ్యే నీళ్లల్లో 40 శాతం ఆవిరైపోతాయి. 41 శాతం నీరు ప్రాజెక్టులు, చెరువులు చేరుతాయి. 9.5 శాతం నీళ్లు భూగర్బంలోకి ఇంకిపోతాయి. మిగతా 11 శాతం గాలిలో తేమ రూపంలో నీళ్లు ఉంటాయి. చెరువులు, చెక్‌డ్యామ్‌లలో వర్షపు నీటిని నిల్వ చేయడం ద్వారా భూగర్భ జలాలను పెంచవచ్చును. తెలంగాణలో 46 వేల వరకు చెరువులు, చెక్‌డ్యామ్‌ లున్నాయి. చెరువుల్లో చాలా వరకు కబ్జాకు గురికా వడం, ధ్వంసం కావడం జరిగింది. ఆ చెరువులను పూర్తిస్థాయిలో పునరుద్ధరించి నీటి నిల్వలను పెంచాలి. నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న నల్లగొండ జిల్లా చండూరు మండలంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెక్‌డ్యామ్‌ల కింది భాగంలో 40 నుంచి 50 ఫీట్ల లోతు బోర్లను తవ్వి పైనుంచి వచ్చే నీటిని భూగర్భంలోకి పోయే విధానాన్ని ప్రయోగాత్మా కంగా ప్రవేశపెట్టింది.. అక్కడ విజయవంతం కావడంతో మెదక్‌, సిద్దిపేట, నాగర్‌కర్నూల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో కూడా అలాంటి బోర్లను తవ్వించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతున్నది

Related Posts