YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

ఇవాళ్టి నుంచి ఐపీఎల్ మజా

 ఇవాళ్టి నుంచి ఐపీఎల్ మజా

 యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:

క్రికెట్‌ అభిమానుల్ని మునివేళ్లపై నిలబెట్టే మ్యాచ్‌లు.. స్టేడియం పైకప్పు తాకే సిక్సర్లు.. వికెట్లను గాల్లోకి గీరాటేసే యార్కర్లు.. పాదరసంలా కదిలే ఫీల్డర్లు.. ఒక్కటా..! రెండా..? ఎన్నో..! ఎన్నెన్నో..? దాదాపు నెలన్నరపాటు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించేందుకు ఇండియన్ ప్రీమియర్‌ లీగ్ మళ్లీ వచ్చేస్తోంది. అసలైన క్రికెట్ మజాని.. సిసలైన ఉత్కంఠ పోరుల్ని ఆస్వాదించాలనుకునే క్రికెట్ అభిమానులూ సిద్ధమైపోండి..! శనివారం నుంచే ఐపీఎల్ 2019 సీజన్ మ్యాచ్‌లు మొదలుకాబోతున్నాయి. తొలి మ్యాచ్‌లోనే డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో చెపాక్ వేదికగా రాత్రి 8 గంటలకి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఢీకొనబోతోంది. ఐపీఎల్‌ 2019 సీజన్‌లో మొత్తం 8 జట్లు పోటీపడుతుండగా.. ప్రతి జట్టూ లీగ్ దశలో 14 మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో 7 మ్యాచ్‌లను సొంతగడ్డపై.. మరో 7 మ్యాచ్‌ల్ని ప్రత్యర్థి వేదికలపై జట్లు ఆడనున్నాయి. ఈ మేరకు శనివారం (మార్చి 23) ఆరంభంకానున్న లీగ్ దశ మే 5 వరకూ కొనసాగనుంది. ఆ తర్వాత క్వాలిఫయర్స్, ఎలిమినేటర్, ఫైనల్ జరగనున్నాయి. మ్యాచ్‌లు గత ఏడాది తరహాలోనే సాయంత్రం 4 గంటలకి, రాత్రి 8గంటలకి ప్రారంభంకానున్నాయి. ఐపీఎల్‌లో పోటీపడుతున్న జట్లు..! 1. చెన్నై సూపర్ కింగ్స్, 2. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, 3. సన్‌రైజర్స్ హైదరాబాద్, 4. ఢిల్లీ క్యాపిటల్స్ (ఢిల్లీ డేర్‌డెవిల్స్ పేరు మార్చుకుంది), 5. కింగ్స్ ఎలెవన్ పంజాబ్, 6. రాజస్థాన్ రాయల్స్, 7. కోల్‌కతా నైట్‌రైడర్స్, 8. ముంబయి ఇండియన్స్
2008లో ప్రారంభమైన ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ 11 సీజన్లు పూర్తవగా.. చెన్నై, ముంబయి జట్లు మూడు సార్లు విజేతగా నిలవగా.. కోల్‌కతా రెండు సార్లు, సన్‌రైజర్స్ హైదరాబాద్, డక్కన్ ఛార్జర్స్, రాజస్థాన్ రాయల్స్ ఒక్కోసారి టైటిల్‌ను గెలిచాయి. బెంగళూరు, ఢిల్లీ, పంజాబ్ జట్లు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయాయి. 

Related Posts