YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అందరి సమస్యలు విన్నాను

 అందరి సమస్యలు విన్నాను

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

పాదయాత్ర లో మీ అందరి సమస్యలు నేను విన్నాను. మీ సమస్యలు తీర్చడానికి నేను ఉన్నానని భరోసా ఇస్తున్నాను. 
దేశంలో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ వసూలు చేస్తుంటే, టీఎస్టీ ( తెలుగుదేశం సర్వీస్ టాక్స్) వసూలు చేస్తున్నారు. భావనపాడు పోర్టు విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని , తిత్లీ పరిహారం చెల్లింపులో జరుగుతున్న అలసత్వాన్ని నేను విన్నానని వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి అన్నారు. శనివారం అయన పలాస- కాశీబుగ్గ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 
పెన్షన్ రాకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్న కిడ్నీ బాధితుల బాధలు విన్నాను. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టిస్తాం. కిడ్నీ బాధితులకు 10 వేలు పెన్షన్ ఇస్తాం. ప్రతీ ఒక్కరికీ రక్షిత మంచినీరు , సాగునీరు అందజేస్తానని అయన అన్నారు. మీరు అందరూ ఒక్కసారి ఆలోచించండి. అసలు అభివృద్ధి అంటే ఏమిటో ఆలోచించండి. నిన్నటి కన్నా ఈ రోజు బాగుండడమే అభివృద్ధి అని నేను నమ్ముతున్నాను. రైతులకు రుణాలు, గిట్టుబాటు ధరలు వస్తున్నాయా అని అడుగుతున్నాను. అక్కా, చెల్లెమ్మలు రుణమాఫీ జరిగిందా, రుణాలు వచ్చాయా అని అడుగుతున్నాను. ప్రతీ ఇంటికి లక్షా 20 వేలు నిరుద్యోగ భృతి అందిందా అని అడుగుతున్నానని అన్నారు. బెల్టు షాపులు మూసేస్తాను అన్న చంద్రబాబు పాలనలో మద్యం ఏరులై పారుతోంది. ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టారు. 
మీ అందరికీ నేను వున్నాను. దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం వస్తే మీ అందరి పిల్లలను నేను చదివిస్తాను.  మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ప్రతీ సంవత్సరం జనవరి 1 తేదీన ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తాం. 75 శాతం ఉద్యోగాలు పూర్తిగా లోకల్ వాళ్ళుకు ఇవ్వాలని శాసనసభలో చట్టం తీసుకొస్తాను. 
గవర్నమెంట్ తీసుకునే కాంట్రాక్టులన్నీ నిరుద్యోగులకు ఇస్తాను. నిరుద్యోగులకు సబ్సిడీ ఇచ్చి కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్దుతానని జగన్ అన్నారు. ఈ కాంట్రాక్టులలో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ లకు కేటాయిస్తాను. గ్రామ సచివాలయంలో 10 మంది ఆ గ్రామంలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాం. గ్రామంలో ఉన్న ప్రతీ 50 ఇళ్ళకు ఒక గ్రామ వాలంటీర్ ను నియమించి 5 వేల రూపాయలు గౌరవ వేతనం ఇస్తాం. నవరత్నాలను అందరికి చేరేలాగా గ్రామ వలంటీర్లతో మీ గడప వద్దకు అందిస్తామని అయన అన్నారు.

Related Posts