YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

హమీలను మరిచారు

హమీలను మరిచారు
నిజామాబాద్ ప్రజలు ఇచ్చిన అవకాశం తోటి 10 సంవత్సరాలు సేవచేసుకోవటానికి అవకాశం కల్పించిన ప్రజలకు కృతజ్ఞతలు. జిల్లాలో  పాస్ పోర్ట్ సేవ కేంద్రం,  తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పొషించడం, నిజామాబాద్ జిల్లాకు తెలంగాణ యూనివర్సిటీ, మెడికల్ కళాశాల,నిజమాబాడ్ పెద్దపల్లి రైల్వే, పెద్దపల్లి నుండి మోర్తాడ్ వరకు రైల్ ను తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని నిజామాబాద్ పార్లమెంట్ యంపీ కాంగ్రెస్ అభ్యర్థి  మధుయాష్కీ  అన్నారు. గుప్తా అలిసాగర్, లిఫ్ట్ ల ఘనత కాంగ్రెస్ పార్టీ యే. విభజన చట్టం లో ఉన్న హామీలు తెచ్చుకోవడం లో టిఆర్ ఎస్ పార్టీ విఫలం, ఇప్పుడు16 ఎంపీల తో ఎం చేస్తారా అని అడిగారు. ఐదు సంవత్సరాల కాలం లో తెలంగాణ లో అమరులైన వారిని  అదుకోకపోవడం ,ఉద్యోగ కల్పన లో టిఆర్ ఎస్ పార్టీ విఫలం అయింది. 2019 సార్వత్రిక ఎన్నికలు దేశ సార్వబౌ మత్వాన్ని కాపాడటం కోసం జరుగుతున్న ఎన్నికలని అన్నారు.  దేశం కోసం పోరాటం చేసి ఎందరో ప్రాణత్యాగలతో దేశం స్వతంత్రం వచ్చింది. ఫ్రంట్ కేసీఆర్ బ్యాక్ మోడీ. బిజెపి కి కాంగ్రెస్ పార్టీ కి జరుగుతున్న ఈ పోరాటం.  కాంగ్రెస్ పార్టీ దళితుణ్ణి ప్రతిపక్ష నాయకుని చేసాం. దళితుడు నన్ను ప్రశ్నిస్తాడా అని సంప్రదాయానికి విరుద్దంగా ఎం ఎల్ ఎ లను కొంటున్నాడని విమర్శించారు.  జాతీయ స్థాయిలో మోడీ తిరిగి ప్రధాన మంత్రి అయితే ఉచ కోతలు గుజరాత్ తరహా జరుగుతాయి. మైనారిటీలపై దాడులు జరిగితే కవిత, సీఎం కేసీఆర్ లు ఎప్పుడైనా  స్పందించారా అని ప్రశ్నించారు. బెస్ట్ ప్రధాని అని అమరావతిలో ఉలువచారు తాగి మాట్లాడి ఇక్కడి కి వచ్చి మోడీని తిడుతాడు. ఇదెక్కడి సియం కేసీఆర్ అని అన్నారు.  నిజామాబాద్ లో ఎంతమంది యువకులకు ఉద్యోగాలు కల్పించారు. గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏమైందని నిలదీసారు. 

Related Posts