YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

ఈవీఎంల కేటాయింపు

ఈవీఎంల కేటాయింపు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

లోక్ సభ ఎన్నికల ఏర్పాటును పారదర్శకంగా చేస్తున్నట్లు వరంగల్ (ఎస్పీ) పార్లమెంట్ నియెజకవర్గం రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జె.పాటిల్ తెలిపారు. శనివారం ఏనుమాముల మార్కెట్ యార్డ్ జిల్లా ఎన్నికల అధికారి గోదాము లో గుర్తింపు పొందిన రాజకీయపార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచిన ఈ వి ఎం లను మొదటి విడడత ర్యాండమైజేషన్ ద్వారా వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ,  వర్ధన పేట నియోజకవర్గాలకు కేటాయించారు.  27 శాతం రిజ్వర్ తో వరంగల్ తూర్పులోవున్న 215 పోలింగ్ కేంద్రాలకు 274 బ్యాలెట్ యూనిట్లు 274 కంట్రోల్ యూనిట్లు, 30 శాతం రిజ్వర్ తో 280 వీవీప్యాట్లు కేటాయించారు. అదేవిధంగా వరంగల్ పశ్చిమ లోవున్న 241 పోలింగ్ కేంద్రాలకు 307 బ్యాలెట్ యూనిట్ 307 కంట్రోల్ యూనిట్ 314 వీవీప్యాట్లు వర్ధన్నపేట నియోజకవర్గంలో వున్న  268 పోలింగ్ కేంద్రాలకు 314 బ్యాలెట్ యూనిట్ 341 కంట్రోల్ యూనిట్ 34999 వీవీప్యాట్లును కేటాయించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ యస్.దయానంద్, అసిస్టెంట్ కలెక్టర్ సంతోష్, రిటర్నింగ్ అధికారులు, రవి కిరణ్, వెంకారెడ్డి, తహశీల్దార్లు బావుసింగ్, రాజేష్ , ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts