YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మీర్ ఆలం ట్యాంక్ పార్కు ను ప్రారంభించిన సీ.ఎస్. ఎస్.కే.జోషి

మీర్ ఆలం ట్యాంక్ పార్కు ను ప్రారంభించిన సీ.ఎస్. ఎస్.కే.జోషి

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

గ్రేటర్ హైదరాబాద్ లోని ప్రతి జోన్లో రెండు మేజర్ పార్కులను కొత్తగా అభివృద్ది చేయాలన్న జీహెచ్ఎంసీ కార్యక్రమంలో భాగంగా చార్మినార్ జోన్లో కొత్తగా రూపొందించిన మీర్ ఆలం ట్యాంక్ చెరువు పార్కు శనివారం నాడు నగరవాసులకు అందుబాటులోకి వచ్చింది. ఈ పార్క్ ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి ఎస్.కే. జోషి ప్రారంభించారు.  అయనతో పాటు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్,  జీహెచ్ఎంసీ కమీషనర్ దాన కిషోర్ లతో కలసి ప్రారంభించారు. దాదాపు రూ. 2.51 కోట్ల వ్యయంతో మీర్ ఆలం ట్యాంక్ కు చింతల్ మెట్ వైపు ఈ పార్కును సర్వాంగ సుందరంగా జీహెచ్ఎంసీ రూపొందించింది. హైదరాబాద్ - బెంగుళూరు రహదారి మధ్యలో ఉన్న మీర్ ఆలం ట్యాంక్ అనే సరస్సు నెహ్రు జూలాజికల్ పార్క్ కి అత్యంత సమీపంలో ఉంది. హుస్సేన్ సాగర్ అలాగే హిమాయత్ సాగర్ లు నిర్మాణం కాక ముందు నుండే హైదరాబాద్ నివాసితులకి త్రాగు నీరు అలాగే వంట అవసరాల కోసం నీరు అందించేందుకు ఈ మీర్ ఆలం సరస్సు ఉపయోగపడేది. హైదరాబాద్ రాష్ట్రానికి అప్పటి ప్రధాని మంత్రిగా వ్యవహరించిన మీర్ ఆలం బహదూర్ చేత 1804 లో ఈ సరస్సు నిర్మించబడినది. హైదరాబాద్ మూడవ నిజాం అయిన మీర్ అక్బర్ అలీ ఖాన్ సికందర్ జాహ్ ఆసిఫ్ జాహ్ హయాంలో అతని చేత ఈ సరస్సు నిర్మాణమయింది. ఈ సరస్సుని నిర్మించడానికి దాదాపు రెండు సంవత్సరాలు పట్టింఇ. ఈ సరస్సు వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. టిప్పు సుల్తాన్ పై యుద్ధం చెయ్యడానికి మీర్ ఆలం నిజాం బలగాలని పంపారు. టిప్పు సుల్తాన్ ని ఓడించిన తరువాత మీర్ ఆలం శ్రీరంగపట్నం నుండి తీసుకున్న ఖజనాతో ఈ సరస్సుని కట్టారని ప్రతీతి. 
చార్మినార్ జోన్లో రెండో అతిపెద్ద పార్కు
చార్మినార్ జోన్లో ఇమ్లీబన్ పార్కు అనంతరం మీర్ ఆలం పార్కు రెండో అతిపెద్ద పార్కుగా రూపొందింది. 6.5 ఎకరాల విస్తీర్ణంలో రూపొందించిన ఈ పార్కులో అర్బన్ బయోడైవర్సిటీ విభాగం ద్వారా  లైటింగ్, దక్కన్ శైలీ పెయింటింగ్లు, ఓపెన్ జిమ్, పిల్లల ఆట వస్తువులు, పౌంటెన్లు, మినీ సైన్స్ పార్కు, దక్కన్ శైలీ శిల్పాలను, చిత్రాలను ఏర్పాటు చేశారు. పార్కు ప్రవేశ ద్వారంలోనే దక్కన్ శైలీ శిల్పాలు, చిత్రాలతో కూడిన ఎంట్రీ ప్లాజా ప్రతిఒక్కరిని ఆకట్టుకునేవిధంగా ఉంది. ఈ చెరువులో 6.8 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్ను 8మీటర్ల వెడల్పుతో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.

Related Posts