YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అవి పోలింగ్ స్లిప్పులు కావు

అవి పోలింగ్ స్లిప్పులు కావు

 యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వెలుగు చూసిన వీవీప్యాట్ స్లిప్పులు పోలింగ్ రోజువి కాదు. ఆత్మకూరు ప్రభుత్వ పాఠశాల కేవలం ఈవిఎంల కమీషనింగ్ సెంటర్ మాత్రమేనని ఏపీ సీఈవో గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. సోమవారం అయన మీడియాతో మాట్లాడారు. ఆత్మకూరు ఆర్డీవో ఆధీనంలో ఉన్న ఈవిఎం కమీషనింగ్ సెంటర్లో  బ్యాలెట్ పత్రాలు పెట్టిన తర్వాత  చెక్ చేశారు. పోలింగ్కు ముందే ఒక్కో నియోజక వర్గానికి కేటాయించిన ఈవిఎంలలో వెయ్యి  ఓట్లను  బెల్ ఇంజినీర్లు పోల్ చేశారు. ఈవిఎంలు సక్రమంగా పనిచేస్తున్నాయని నిర్దారించుకున్న తర్వాత వాటిని పోలింగ్ కేంద్రాలకు తరలించారు. 
ఎవరో ఉద్యోగి ఉద్దేశపూర్వకంగా  కమీషనింగ్ సమయంలో వేసిన వీవీప్యాట్ స్లిప్పులను బయట పారేశారని అన్నారు. వీవీప్యాట్ స్లిప్పుల విషయంలో ఆత్మకూరు ఎన్నికల ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. బాధ్యులైన ఉద్యోగులపై క్రిమినల్ కేసు పెట్టి తక్షణం అరెస్ట్ చేయాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించినట్లు అయన వెల్లడించారు. ప్రతి నియోజక వర్గం పరిధిలో జరిగే తప్పులకు ఆర్వోలే బాధ్యులవుతారని అయన హెచ్చరించారు. 

Related Posts