YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

స్ట్రాంగ్ రూమ్ లో అన్నీ సేఫేనా....

స్ట్రాంగ్ రూమ్ లో  అన్నీ సేఫేనా....
ఏపీలో భారీ ఉత్కంఠ నడుమ ముగిసిన ఎన్నికలు.. ఆ తర్వాత కూడా వరుసగా పెను సంచలనాలు సృష్టిస్తున్నాయి. తాజాగా స్ట్రాంగ్ రూమ్ లను తెరిచి ఈవీఎం లను తరలించిన ఘటన ఏపీ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోంది. పోలింగ్ బుతుల్లో గొడవలు చేసి ఓటింగ్ ఆపాలని చేసిన కుట్రలు విఫలం కావడంతో ఇక ఈవీఎంలు మార్చే పనిలో విపక్ష నేతలు బిజీగా ఉన్నారా? ఎన్నికల్లో ప్రజా మద్దతును మార్చలేని నేతలు ఇప్పుడు ఈవీఎంలు మార్చే పనిలో ఉన్నారా? అనే కోణంలో అనుమానాలు మొదలయ్యాయి. ఇంతకీ ఈ ఉదంతం ఎక్కడ జరిగింది? అనే విషయానికొస్తే..స్ట్రాంగ్‌ రూమ్‌ తలుపులు తెరుచుకున్నాయి! అవును… మే 23వ తేదీ తెరుచుకోవాల్సిన మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌ను మూడు రోజుల కిందట రాత్రి సమయంలో తెరిచారు. అందులో నుంచి ఈవీఎంలను వాహనాల్లో తరలించారు. మచిలీపట్నం లోక్‌సభ స్థానంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన ఈవీఎంలను కృష్ణా వర్సిటీలో భద్రపరిచారు. పోలింగ్‌ ముగిసిన అనంతరం  కలెక్టర్‌, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్‌రూమ్‌లకు సీలు వేశారు. వాటిని ఏ కారణంతో తెరవాలన్నా… ఎన్నికల సంఘం అనుమతితో కలెక్టర్‌తోపాటు రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలోనే తెరవాల్సి ఉంటుంది. అయితేకలెక్టర్‌, పార్టీల ప్రతినిధులు లేకుండానే స్ట్రాంగ్‌రూమ్‌ సీలు తీసి, తలుపులు తెరిచి మూడు టాటా ఏస్‌ వాహనాల్లో ఈవీఎంలను తరలించారు. అసలే ఎన్నికల కమిషన్‌పై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఇలాంటి సమయంలో స్ట్రాంగ్‌రూమ్‌ తెరిచి ఈవీఎంలను తరలించడం రాష్ట్రంలోని అన్ని రాజకీయ వర్గాల్లో వివాదాస్పదంగా మారింది. అయితే ఈ పని చేయడం వెనుక వైసీపీ కుట్ర దాగి ఉందనే టాక్ బలంగా వినిపిస్తోంది.దీంతో టీడీపీ అనుకున్నదే జరుగుతుందా? టీడీపీ నేతలు అనుమనించిందే జరుగుతుందా? ఎన్నికల్లో ప్రజా మద్దతును మార్చలేని వైసీపీ నేతలు ఇప్పుడు ఈవీఎంలు మార్చే పనిలో ఉన్నారా? అందుకే ఎన్నికల సంఘం భేష్ అంటూ ప్రకటనలు వారు చేస్తున్నారా? ఈ ప్రశ్నలు ఇప్పుడు సామాన్య జనం మదిలో మెదులుతున్న ప్రశ్నలివి. కాగా ఈవీఎంల తరలింపు విషయమై కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ను సంప్రదించగా.. అవి నూజివీడు నియోజకవర్గానికి చెందిన రిజర్వు ఈవీఎంలు అని, ఆ నియోజకవర్గ రిటర్నింగ్‌ ఆఫీసర్‌, సబ్‌ కలెక్టర్‌ స్వపిన్‌ దినకర్‌ ఆధ్వర్యంలో వాటిని ఆయన చెబుతుండటం గమనార్హం. అయితే ఈ విషయమై అన్ని పార్టీల ప్రతినిధులకు సమాచారం ఇచ్చినప్పటికీ వారు ఎవరూ రాలేదని అధికారులు పేర్కొంటున్నారు. కానీ అందులో వాస్తవం ఉందా? అనేది జనం అనుమానం. ఈ నేపథ్యంలో ఇదంతా ప్రధాన ప్రతిపక్షం చేస్తున్న కుట్రనే అనే అనుమానాలు వస్తున్నాయి

Related Posts