YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చెంచుల ఆర్థిక మరియు సామాజిక ఉన్నతికి ముందడుగు వేయాలి

 చెంచుల ఆర్థిక మరియు సామాజిక ఉన్నతికి ముందడుగు వేయాలి

ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ శ్రీశైలం నల్లమల అడవులలో సంచార జీవనానికి అలవాటు పడ్డ చెంచులు జీవన ప్రమాణం నైపుణ్యం ద్వారా అభివృద్ధి చేయటానికి ప్రయత్నం చేస్తోంది.  ఇందులో భాగంగ నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారులు రెండు రోజులు విస్తృతంగా శ్రీశైలం ప్రాంతంలో ఉన్న చెంచు గూడెం లలో  , (అంకమ్మ చెంచుగూడెం, చింతన, తుమ్మల చెంచుగూడెం  ఇష్టకామేశ్వరి చెంచుగూడెం), పర్యటించి నారు..  ఐటీడీఏ అధికారుల సహకారంతో  మహిళలు మరియు యువత యొక్క  అభిప్రాయాన్ని కనుక్కోవడం జరిగింది.శ్రీశైలం అడవుల్లో  వీరి జీవనోపాధి నరేగా మరియు నన్నారే దుంపల సేకరణ మీద ముఖ్యంగా ఆధారపడి ఉంది.  కానీ  దుంపలు కూడా ఈ మధ్యకాలంలో లో లభ్యం కాకపోవడంతో ఈ ఆర్థిక వనరు కూడా వీరికి కష్టమవుతుంది.

అందువలన ఐటీడీఏ అధికారులతో అలాగే రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ RDT ఎన్జీవో అధికారులతో చర్చించి క్రింది నైపుణ్యం మరియు ఉపాధి అవకాశాలు చెంచులకు కలుగజేయాలని  సూత్రప్రాయంగా అంగీకరించడం అయినది

1. చెంచు గూడేలలో ఉన్న మూడు  క్లస్టర్ కమ్యూనిటీ సెంటర్లో లో ముందుగా 5 ఐదు కొత్త మిషను లను ఏర్పాటు చేయటం. ప్రతి గ్రామం నుంచి  ఇద్దరు మహిళలకు స్కూలు విద్యార్థుల యూనిఫామ్లు కుట్టే విధంగా  నైపుణ్య శిక్షణ ఇవ్వడం. ఐటీడీఏ వారు వారి పరిధిలో ఉన్న అన్ని పాఠశాలల యొక్క యూనిఫాంలను  ఈ చెంచుగూడెం లలో ఉన్న కమ్యూనిటీ సెంటర్ల ద్వారా కొనుగోలు చేయటం. తద్వారా రమారమి 30 మంది చెంచు మహిళలకు మంచి ఉపాధి కలిగే అవకాశం ఉంటుంది.

2. చింతన మరియు తుమ్మన బైలు గ్రామాలలో ఉన్న చెంచు మహిళలు సొసైటీ స్థాపించుకొని విస్తరి  ఆకులు కుట్టే విధంగా ఉత్సాహం చూపుతున్నారు.
30 మంది మహిళలకు ఎన్జీవో ద్వారా నైపుణ్య శిక్షణ ఇచ్చి ఒక ప్రొడక్షన్ సెంటర్ ను నెలకొల్పడం. ఐటీడీఏ అధికారులు తగిన స్థలం ఇస్తారు.. ఎన్జీవో వారు శ్రీశైలం అధికారులతో కమర్షియల్ టై అప్ పెట్టుకున్నట్లయితే, ఈ మహిళలకు నైపుణ్య శిక్షణ తర్వాత మంచి ఉపాధి అవకాశం కలుగుతుంది.

3. బైర్లూటి నాగలూటి గ్రామాలలో ఉన్న మహిళలు బుక్ బైడింగ్ విషయంలో  ఆసక్తి చూపుతున్నారు. నైపుణ్య శిక్షణ ద్వారా ఉపాధి కల్పన చేయగలిగితే ఎన్జీవో పూర్తి సహకారం అందజేయనున్నారు.

4. ఈ ప్రాంతంలో లో యువత కాంక్రీట్ మిల్లర్ యూనిట్  కావాలని కోరారు. అందులో శిక్షణ ఇచ్చినట్లయితే  రమారమి 30 మంది యువత ఐటీడీఏలో లో అనేక పనులు తమంతట తామే చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఈ  ప్రతిపాదన ఫై అధికారులకి త్వరగా సమర్పించగలరు.

5. ఈ ప్రాంతంలో లో సెంటర్ ఇన్ యూనిట్ మరియు ఒక  వెహికల్ ఏర్పాటు చేసి 30 మంది  గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చినట్లయితే, ప్రతినిత్యం వీరికి ఐటీడీఏ పరిధిలో ఉపాధి కలిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి..ఈ ప్రతిపాదనను కూడా త్వరగా సబ్మిట్ చేయగలరు.

6. నన్నారే దుంపల లభ్యత రోజురోజుకి తగ్గిపోవడంతో చెంచులు చాలా ఇబ్బంది పడుతున్నారు. పది రోజులు అడవిలో నాకు కూడా వారికి సరైన దుంపలు దొరకటం లేదు. అందువలన 30 మంది చర్చి యువతకు నన్నారే నర్సరీ పెంపకం విషయంలో లో నైపుణ్య శిక్షణ ఇచ్చినట్లయితే, వీరు వారి గ్రామాల చుట్టుపక్కల వీటి పెంపకం జూన్ నుండి మొదలు పెట్టి తగిన రాబడి పొందడానికి అవకాశం ఉంటుంది.

7. అదేవిధంగా నంది గూడెం చుట్టుపక్కల ఉన్నటువంటి చెంచులు మేకలు ఇచ్చినట్లయితే పూర్తిస్థాయిలో పెంచుకోవడానికి ఉత్సాహం చూపించారు దీని విషయంలో కూడా తగిన ప్రతిపాదన చేయవలసినది.

మొదటి తప్పగా పై కార్యక్రమాలను చేపట్టి చెంచుల ఆర్థిక మరియు సామాజిక ఉన్నతికి నైపుణ్య వికాసం ద్వారా ముందడుగు వేయాలి

Related Posts