YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఆ కథనంతో ప్రభుత్వానికి కోపం వచ్చింది

 ఆ కథనంతో ప్రభుత్వానికి కోపం వచ్చింది
తెలంగాణ ప్రభుత్వంపై టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ పలు ఆరోపణలు చేశారు. పోలీసుల నోటీసులకు స్పందించకుండా ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న ఆయన ఓ వెబ్ సైట్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో పలు విషయాలను ఆయన వెల్లడించారు. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడిన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో, విద్యార్థుల ఆత్మహత్యలను ప్రశ్నిస్తూ టీవీ 9లో ఓ కథనాన్ని ప్రసారం చేశానని ఆయన తెలిపారు. ఆ కథనం తెలంగాణ ప్రభుత్వానికి నచ్చలేదని... అప్పటి నుంచి తనను టార్గెట్ చేశారని చెప్పారు.తనను టార్గెట్ చేయడం వెనుక ఒక స్పష్టమైన రాజకీయ, వ్యాపార అజెండా ఉందని రవిప్రకాశ్ తెలిపారు. వాస్తవానికి ఆ లైవ్ షోను ప్రసారం చేసే సమయంలో కూడా తాను ప్రభుత్వం గురించి ప్రస్తావించలేదని, కేవలం వ్యవస్థ వైఫల్యం గురించే ప్రశ్నించానని చెప్పారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడితే తామంతా ప్రశ్నించకుండా... చూసీచూడనట్టు వ్యవహరించాలా? అని రవిప్రకాశ్ మండిపడ్డారు

Related Posts

0 comments on " ఆ కథనంతో ప్రభుత్వానికి కోపం వచ్చింది"

Leave A Comment