YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

షా పై చంద్రబాబు ఫైర్

 షా పై చంద్రబాబు ఫైర్
బీజేపీ చీఫ్ అమిత్ షా మంగళవారం కోల్‌కతాలో చేపట్టిన రోడ్ షో ఉద్రిక్తతలకు కారణమైన సంగతి తెలిసిందే. తనపై తృణమూల్ గుండాలు దాడి చేశారని అమిత్ షా ఆరోపించగా.. బీజేపీ చీఫ్ రౌడీలా వ్యవహరించారని మమతా బెనర్జీ మండిపడ్డారు. బెంగాల్ పునరుజ్జీవనానికి కృషి చేసిన ఈశ్వర చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని కూల్చేయడం పట్ల ఆమె మండిపడ్డారు. నిరసనగా దీదీతోపాటు టీఎంసీ కార్యకర్తలు తమ ఫేస్‌బుక్, ట్విట్టర్ ప్రొఫైల్ పిక్‌లుగా ఈశ్వర చంద్ర విద్యాసాగర్ ఫొటోలను పెట్టారు. టీఎంసీ అధికారిక పేజీ ప్రొఫైల్ ఫొటోలను కూడా మార్చేశారు. బీజేపీ దాడులకు నిరసనగా బుధవారం ర్యాలీ చేపడుతున్నట్టు దీదీ ప్రకటించారు. బెంగాల్లో బీజేపీ, టీఎంసీ మధ్య తలెత్తిన ఘర్షణల పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ‘సీబీఐ-ఈడీ, ఐటీలకు భయపడలేదని, ఎన్నికల సమయంలో భయోత్పాతం సృష్టించే ప్రయత్నంలో భాగంగా బీజేపీ వారి బీ టీంలు గూండాలను నేరుగా రంగంలోకి తెచ్చారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగాలపై విలువ లేని వారు ఇటువంటి చర్యలకు పాల్పడుతారు. మమతా బెనర్జీకి సంఘీభావం తెలుపుతూ అమీత్ షా చర్యలను ఖండిస్తున్నా’మని చంద్రబాబు ట్వీట్ చేశారు. ధర్మో రక్షిత రక్షిత: అనే సూక్తి స్పూర్తికి విరుద్దంగా, హింస ద్వారా రాజకీయం చేద్దాం అనుకుంటే ఈ దేశం మొత్తం గుజరాత్ లా మోదీ- షాలను నమ్మి మోయడానికి సిద్దంగా లేదు.సీబీఐ-ఈడీ, ఐటీలకు బయపడలేదని, ఏన్నికల సమయంలో భయోత్పాతం సృష్టించే ప్రయత్నంలో భాగంగా బీజేపీ వారి బీ టీంలు గూండాలను నేరుగా రంగంలోకి తెచ్చారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగాలపై విలువ లేని వారు ఇటువంటి చర్యలకు పాల్పడుతారు. మమతా బెనర్జీ గారికి సంఘీబావం తెలుపుతూ అమీత్ షా చర్యలను ఖండిస్తున్నాం.పశ్చిమ బెంగాల్‌లో అమిత్ షా నిన్న కావాలనే తన ర్యాలీలో గూండాలతో అల్లర్లు సృష్టించడం చూశాం. గతంలో గుజరాత్‌లో కుడా అమిత్ షాను అడ్డుపెట్టుకొని మోదీ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం భారత దేశంలో ప్రజలందరికీ తెలిసిందే’నన్న బాబు.. ‘పశ్చిమ బెంగాల్‌లో అసలు బలం లేని బీజేపీ, సీనియర్ మహిళా నేత లాంటి మమతా బెనర్జీపైకి రాక్షసుల్లా విధ్వంసం సృష్టించి, అక్కడ ప్రభుత్వానికి చెడ్డ పేరు కల్పించి రాజకీయ పబ్బం గడుపుకుందాం అనే వికృత మోదీ-షాల పాచిక పారద’ని విమర్శించారు. ‘ధర్మో రక్షిత రక్షిత: అనే సూక్తి స్పూర్తికి విరుద్ధంగా, హింస ద్వారా రాజకీయం చేద్దాం అనుకుంటే ఈ దేశం మొత్తం గుజరాత్‌లా మోదీ- షాలను నమ్మి మోయడానికి సిద్ధంగా లేద’ని చంద్రబాబు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

Related Posts