YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మారుతున్న సీజన్... దోమలతో జరా భద్రం

మారుతున్న సీజన్... దోమలతో జరా భద్రం

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

కంటికి కూడా అంతగా కనిపించని  జీవి దోమ మన ఒంటికి చేసే కీడు అంతా ఇంతా కాదు. మన రక్తం పీల్చి అది బతికేస్తుంది. మన ప్రాణాలను మాత్రం ప్రమాదంలోకి నెట్టేస్తుంది. ఏడిస్‌ ఈజిప్టై అనే ఆడ దోమతో ప్రమాదం  ఇది. పగటి పూట ఈ దోమ కుడితే కొన్ని రోజుల్లోనే డెంగీ బారిన పడతాం.వర్షాకాలం వస్తే భయపెట్టే వ్యాధుల్లో మలేరియా, టైఫాయిడ్‌, డెంగీ ప్రధానం. డెంగీ వణికించే వ్యాధి. వర్షాకాలం దోమలకు ఆయువు పట్టు. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలను హరిస్తుంది. ఏటా జూన్‌ నుంచి అక్టోబరు వరకు వందల సంఖ్యలో ప్రజలు దీని బారిన పడుతున్నారు. పరిసరాల పరిశుభ్రతతోనే దీనిని నియంత్రించవచ్చును. జ్వరంతో ప్రారంభమై అంతర్గత రక్తస్రావం వరకు చేరుకొని చివరికి ప్రాణాలను బలిగొంటుంది.దోమలపై నిరంతరం దండయాత్ర చేస్తేనే ఇటువంటి వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త పడొచ్చు. పరిశుభ్రత లోపించిన చోట ఈ సమస్య తలెత్తుంది. పంచాయితీరాజ్‌, పురపాలక సంఘాలకు లేఖలు రాశాం. డెంగీ కేసులు వస్తున్న దగ్గర వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం. అనుమానిత లక్షణాలతో ఎవరున్నా చికిత్స తీసుకోవడమే సత్వర ఉపశమనం. సొంత నిర్ణయం తీసుకొని..సొంత వైద్యంతో ప్రాణాల మీదకు తెచ్చుకోరాదు. లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడ్ని కలిసి చికిత్స తీసుకుంటే వేగంగా కోలుకోవచ్చు. కేంద్ర ఆసుపత్రిలో దీనికి సంబంధించి ప్రయోగశాల ఉంది. ఉచితంగానే పరీక్షలు అందిస్తారు. డెంగీలో మరో రకం డెంగీ హీమరేజిస్‌ ఫీవర్‌. ఇది ప్రమాదకరమైనది. శరీరంలో ఏ భాగంలోనైనా అంతర్గత రక్తస్రావం జరుగుతుంది. చర్మంపై ఎర్రటి మచ్చలు కనిపిస్తాయి. ముక్కు నుంచి రక్తస్రావం, రక్తవాంతులు, మెదడు, పొట్ట, ఊపిరితిత్తుల్లో రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రక్తాన్ని గడ్డకట్టించే ప్లేట్‌లెట్స్‌ బాగా తగ్గిపోవడంతో ఈ సమస్య ఏర్పడుతుంది.డెంగీలో మరో రకమైన వ్యాధి ఇది. శరీరంలో ప్లూయిడ్స్‌ పడిపోవడం, శరీరం లోపల  అవయవాల్లో రక్తస్రావం జరగడం ద్వారా నాడీ వ్యవస్థ బలహీనపడుతుంది. దీంతో బీపీ పడిపోవడం, కాళ్లు, చేతులు వణకడం, తీవ్రమైన దాహం వంటి లక్షణాలు కనిపిస్తాయి. డెంగీ హీమరేజిస్‌, సిండ్రోమ్‌ వచ్చినప్పుడు ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందించాలి. జ్వరం వచ్చిన వెంటనే సొంత వైద్యం కాకుండా వైద్యులను సంప్రదించాలి. చల్లని నీటితో శరీరాన్ని తుడవాలి. చల్లని ప్రదేశంలో పడుకోబెట్టాలి. తగ్గిన ప్లేట్‌లెట్స్‌ను వైద్యుల సలహా మేరకు ఎక్కించాలి.పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దోమలు రాకుండా, కుట్టుకుండా నివారించాలి. దోమ తెరలు విరివిగా వాడాలి. తరచూ జ్వరం వస్తే డెంగీ వచ్చిందనుకోరాదు. అలా అని నిర్లక్ష్యం చేయరాదు. మలేరియా, టైఫాయిడ్‌ లక్షణాలు కూడా ఇంచుమించు ఇలాగే ఉంటాయి. వ్యాధి నిర్ధరణతోనే చర్యలు తీసుకోవాలి. చికిత్సతో పాటు ఆహార నియమాలు పాటించాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు తీసుకోవాలి. ప్లూయిడ్స్‌ ఎక్కువుగా ఇవ్వాలి. ఓఆర్‌ఎస్‌ ద్రావణం తాగించాలి. మజ్జిగ, కొబ్బరి నీరు పట్టించాలి. పండ్ల రసాలు ఎక్కువుగా ఇవ్వాలి.

Related Posts