YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జూలై నుంచి జగన్ ప్రజా దర్బార్

జూలై నుంచి జగన్ ప్రజా దర్బార్

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా.. పాలనలో సంచలన నిర్ణయాలతో తండ్రి బాటలో పయనిస్తున్నారు. ఇకపై ప్రజల సమస్యల్ని నేరుగా తెలుసుకునేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి రోజూ అరగంటసేపు ప్రజా సమస్యల్ని ఆయనే స్వయంగా తెలుసుకోనున్నారు. ప్రజా దర్బార్ పేరుతో జగన్ ప్రజా సమస్యల్ని తెలుసుకోబోతున్నారు. జులై మొదటి వారం నుంచి ప్రజా దర్బార్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారట. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 8.30 వరకు అరగంటసేపు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ప్రజా దర్బార్‌లో ప్రజా సమస్యలు, విజ్ఞ‌ప్తులను ముఖ్యమంత్రి హోదాలో స్వయంగా జగన్‌మోహన్ రెడ్డి స్వీకరిస్తారు. ఆ సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోబోతున్నారు. గతంలో జగన్ తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కూడా ప్రజా సమస్యల్ని నేరుగా తెలుసుకునేందుకు ఇలాంటి కార్యక్రమం చేపట్టారు. ప్రతి రోజూ ప్రజల సమస్యల్ని తెలుసుకునేందుకు కొంత సమయం కేటాయించేవారు. ప్రజల దగ్గర నుంచి వచ్చిన విజ్ఞ‌ప్తులను పరిశీలించి వారి సమస్యల్ని పరిష్కరించేందుకు కృషి చేసేవారు. ఇప్పుడు జగన్ కూడా తండ్రి బాటలోనే పయనిస్తున్నారు. ప్రజా దర్బార్ పేరుతో ప్రజల సమస్యల్ని తెలుసుకునేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజా సమస్యల్ని తెలుసుకునే క్రమంలోనే ఆరోగ్య శ్రీ ఆలోచన వచ్చింది. ఓ పేద కుటుంబం తమ బిడ్డకు వైద్యం చేయించే స్థోమత లేదని.. వైఎస్‌ను కలిసి మొరపెట్టుకుంది. వెంటనే ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సాయమందించారు. అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఇలా ఆర్థిక పరిస్థితి సరిగా లేక.. సరైన వైద్యం అందక ఎంతమంది ఇబ్బందిపడుతున్నారో అనే ప్రశ్న వేధించింది. ఆ ఆలోచనలో నుంచి ఆరోగ్య శ్రీ పథకం వచ్చిందని గతంలో చెప్పారు.

Related Posts