YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మరో రెండు రోజుల్లో పూర్తి కానున్న కాళేశ్వరం

మరో రెండు రోజుల్లో పూర్తి కానున్న కాళేశ్వరం

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

చరిత్రలో ఇక శాశ్వతంగా నిల్వనున్న అధ్బుతమైన కాళేశ్వరం ప్రాజెక్టు పనులు తుదిదశకు చేరుకున్నాయి. రైతులు ఆశించిన లక్షం మేరకు సీఎం కలల పంట అయిన ఈ బహుళార్థ సాధక ప్రాజెక్ట్ పనితీరును పరిశీలించేందుకు ఆయన స్వయంగా పదిహేను రోజుల్లో ఈనెల నాలుగుతో రెండుసార్లు ఈప్రాజెక్ట్ బాటపట్టడం ప్రాధాన్యత సంతరించుకున్నది. అంతేకాక తరతరాలకు ప్రయోజనాన్ని ఇచ్చే దీని ఆవశ్యకత గురించి దేశవ్యాప్తంగా జరిగే చర్చ అత్యంత కీలకాంశమయ్యింది.ఇప్పటికే 99శాతం పనులు పూర్తికాగా కన్నులపండువగా జరిగే శక్తివంతమైన ఎత్తిపోతలతో గోదారమ్మ జలాలు ఎప్పుడెప్పుడు తమ మాగాణాన్ని తడుపుతాయో అని రాష్ట్రం మొత్తం ఆసక్తిగా ఆశతో ఎదురుచూసే మంచిరోజులు వచ్చేనెలతో సమీపిస్తున్నందున వాటిని తలచుకొని అన్నదాతలు మురిసిపోతున్నారు. ఈ అపూర్వ జలయజ్ఞంతో ఏటా రెండు పంటలకు గాను బంగారుతెలంగాణలో ప్రతీ పంట కాలానికి 45లక్షల ఎకరాలకు సాగునీరు అందించి సిరుల పంటలు పండి కరువు దూరమయ్యే హరితరాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించబోతున్నది. అందుకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని మేడిగడ్డ(వరదాయినిగా) వేదిక కానున్నది.ప్రాజెక్ట్‌కు ముఖ్యమైన మేడిగడ్డ బ్యారేజీ పనులను ఈనెల 4న సందర్శించిన సీఎం కేసీఆర్ వచ్చే ఖరీఫ్ కాలానికి గాను పంట పొలాలకు నీరందించేందుకు నిర్ధేశించిన లక్షం మేరకు ఈనెల 15లోగా పనులు పూర్తిచేయాలని ఆయన అధికారులను ఆదేశించడం జరిగింది. దానితో అధికారులు ఈ ఎత్తిపోతల పనుల్లో వేగం పెంచారు. ఎట్టి పరిస్థితుల్లోను గడువులోగా పనులు పూర్తిచేయాలనే నిర్ణయంతో ఎండను లెక్కచేయకుండా అధికార యంత్రాంగం నాణ్యతాలోపం లేకుండా పనులు పూర్తిచేయడంపై నజర్ పెట్టారు. మేడిగడ్డ బ్యారేజీలో 85గేట్లకు గాను సీఎం కేసీఆర్ వచ్చేనాటికి అధికారికంగా 80బిగించడం జరిగిందని, ఈ ఏడు రోజుల్లో మరో ఐదు అమర్చామని, దానితో గేట్ల పని ముగిసిందని ప్రాజెక్ట్ ఇఇ రమణారెడ్డి తెలిపారు. ఇంకా సివిల్ పనులు మిగిలాయని, గేట్లు లిఫ్ట్‌లకై టెస్టింగ్, అలైన్‌మెంట్, ఆప్రాన్, క్లీనింగ్ వంటి చిన్నా చితకా పనులు ఉన్నాయని, అవి పురోగతిలో ఉన్నాయని, మొత్తానికి 99శాతం పనులు ముగిశాయని, గడువులోపు అన్నీ పూర్తవుతాయని చెప్పారు. ఈవిధంగా నిరంతరం ప్రాజెక్ట్ పనులకై ఉన్నతస్థాయి అధికారుల బృందం పర్యవేక్షణ జరుగుతున్నదని అన్నారు.సాధారణంగా అయితే ఇంత భారీ ప్రాజెక్ట్ పనులు రెండు మూడు దశాబ్ధాల వరకు కూడా పూర్తయ్యేది నమ్మకం లేదని, అలాంటి ప్రాజెక్ట్‌లు ఉన్నాయని, సీఎం చొరవతో ఈ మూడు సంవత్సరాల అతి స్వల్ప వ్యవధిలో ఈభారీ కాళేశ్వరం ప్రాజెక్ట్ మేడిగడ్డ పూర్తికావడం మొదటిదని, ఇదో అద్భుత నిర్మాణమని సీనియర్ అధికారులు చెప్పారు. మేడిగడ్డలో నీటి నిల్వ పంపింగ్ కోసం నిరంతరం విద్యుత్ సరఫరా అయినందున అక్కడ ప్రత్యేకించి 2మెగావాట్ల శక్తిగల విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం జరుగుతున్నది. ఈవిద్యుత్ సబ్‌స్టేషన్‌పై ఆధారపడకుండా ఒకవేళ సరఫరాలో అంతరాయం జరిగితే పంపింగ్ వ్యవస్థ ఆగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అందుకోసం ఒక్కొక్కటి 50కెవి సామర్థంగల రెండు అతిశక్తివంతమైన జనరేటర్లను ముందు జాగ్రత్తగా ఏర్పాటు చేశారు.కన్నెపల్లిలో నీటిని పంపింగ్ చేయడానికి గాను 11మోటార్లలో ఇప్పటికే 8మోటార్లను ఇప్పటికే అధికారులు అమర్చారు. బిగించాల్సిన మరో మూడింటి పనులు పురోగతిలో ఉన్నాయి. అంతా అనుకున్నట్లు జరిగితే ముఖ్యమైన వెట్న్ జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి అందుకు సరిపడా నీరులేదు.ప్రాజెక్ట్ పనులు ఫలవంతంగా జరుగుతున్నాయని, నీరు నిల్వ ఉన్నప్పుడు చూస్తే ఆసమయంలో మేడిగడ్డ మహాసాగరాన్ని తలపిస్తుందని అన్నారు. పనులు పూర్తయిన వెంటనే వర్షాకాలంలో అనుకున్నట్లు గేట్ల పనులు విజయవంతం అయ్యాక వచ్చే నెలలో లక్షం మేరకు అందరు ఆశించినట్లు పంటలకు నీరివ్వడం జరుగుతుందని అధికారులు తెలిపారు.ఒక్కో మోటార్ 40మెగావాట్ల(54000హెచ్‌పి) సామర్థం కలవని, సెకన్‌కు 60క్యూసెక్‌ల నీటిని పంపింగ్ చేస్తుందని ఇఇ తెలిపారు. ఆవిధంగా 11మోటార్ల బిగింపు పూర్తయితే 24గంటలు అవి పూర్తిగా పనిచేస్తే 2టీఎంసీల నీరు పంపింగ్ జరుగుతుందని, ఇప్పటికే విడుదల చేసిన గ్రావిటీ కెనాల్ నీరు అప్పట్లో అన్నారం బ్యారేజీకి చేరిందని ఒక అధికారి చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద 16టీఎంసీల నీరు అవసరం ఉందని, అయితే 300టీఎంసీల నీరు గోదావరిలో నిరంతరం ప్రవహిస్తుందని ఆయన అన్నారు.

Related Posts