YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మహానగరంలో నైట్ సఫారీ పై అధ్యయనం

మహానగరంలో నైట్ సఫారీ పై అధ్యయనం

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

నైట్ సఫారీ పార్కును ఏర్పాటు యోచనలో ఉన్న సర్కారు నాటి మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు అధ్యయానానికి సిద్ధమయ్యారు. తొలి ప్రయత్నంగా అప్పటి హెచ్ఎండీఏ కమషనర్ చిరంజీవులు సింగపూర్లోని నైట్సఫారీ తీరుతెన్నులను తెలుసుకునేందుకు ఇంజినీర్లతో కలిసి అధ్యయానికి వెళ్లి వచ్చారు. అనంతరం ఆయన బదిలీ అవ్వడం, ఆపై ఎన్నికల కోడ్‌ అమలుతో నైట్‌ సఫారీ ప్రతిపాదనల వరకు వచ్చి ఆగిపోయింది. ఎన్నికలు ముగియడం, హెచ్ఎండీఏ ప్రత్యేకంగా ప్రాజెక్టు పనులను ఒక్కొక్కటిగా చేపట్టేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే నైట్సఫారీ పార్కును పట్టాలెక్కించేందుకు సన్నద్ధమవుతోంది. ఇందుకుగాను యాక్షన్ప్లాన్ రూపొందించి త్వరలో పనులు చేపట్టాలని భావిస్తోంది. ప్రస్తుత హెచ్ఎండీఏ కమిషనర్ సైతం కసరత్తులు ఆరంభించినట్లు సమాచారం.ప్రపంచపులో మొట్టమొదటి ది నైట్ సఫారీ పార్కు(రాత్రిపూట జంతు ప్రదర్శనశాల) సింగపూర్లో ఉన్నది. అత్యంత ప్రసిద్ధి చెందిన పర్యాటకంగా కేంద్రంగా పేరొందింది. భావన సింగపూర్ జంతు ప్రదర్శనశాల మాజీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ ఓంగ్ స్వీలా దీని నిర్మాణానికి కృషి చేశారు. 63 మిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మించారు. సింగపూర్ జూ, అప్పర్ సీలేటర్ రిజర్వాయర్కు సమీపంలోని 86 ఎకరాలలో నిర్మించి 1994 లో ప్రారంభారు. ఈ నైట్ సఫారీ పార్కులో 130పైగా  జంతుజాతులు, 2,500 పైగా జంతువులు ఉన్నాయి. వీటిలో 40 శాతం జంతువులు భయంకరమైనవి. ముఖ్యంగా చెట్ల జింక, గౌర్, పులులు, సింహాలు, పాంగోలిన్స్, టర్కీలు, ఏనుగులు ప్రత్యేకంగా ఉంటాయి. ప్రత్యేక లైటింగ్లో ఆయా జంతువులను చూసేలా డిజైన్ చేశారు. ఈ పార్కును వన్యప్రాణి రిజర్వ్సింగపూర్ నిర్వహిస్తుండగా ఏటా సుమారు 1.1 మిలియన్ల సందర్శకులు సఫారీని సందర్శిస్తుంటారు. కేవలం రాత్రిపూటనే ఈ పార్కులో సందర్శనకు అనుమతిస్తారు. జంతు ప్రదర్శనతోపాటు లైటింగ్, తదితర షోలుంటాయి. నేచురల్ నదులలో నీళ్ల ప్రవాహం ఎలా ఉంటుందో, అచ్చంగా ఈ పార్కులో నీటి సెలయేరులు సందర్శకులను ఆకట్టుకుంటాయి. సాంప్రదాయ ప్రదర్శనలు, గిరిజన నృత్యాలు నైట్ సఫారీలో ప్రత్యేక ఆకర్షణగాఉంటాయి.గర శివారు కొత్వాల్‌గూడలో 80 ఎకరాల్లో నైట్‌ సఫారీ పార్కును ఏర్పాటు చేసేందుకు హెచ్ఎండీఏ సిద్ధమైంది. అయితే సింగపూర్‌లో మాదిరిగా కాకుండా 80ఎకరాల్లో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.  ఇదివరకే కొత్వాల్‌గూడలోని ఎకో టూరిజం పార్కు కోసం కేటాయించిన 50 ఎకరాలతోపాటుగా మిగతా భూమిని సేకరించే పనిలో ఉన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా అన్ని రకాల హంగులతో ఈ  సఫారీ పార్కును ప్రజలు, ప్రైవేటు భాగస్వామ్యంతో (పీపీపీ) ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రూ.వేల కోట్లు వెచ్చించాలని భావిస్తున్నారు.రకరకాల జంతువులను విదేశాల నుంచి తీసుకురావాలని భావిస్తున్నారు. నైట్‌ సఫారీ పార్కులో జంతువుల మధ్యే ఆహారం తీసుకునేలా ప్రత్యేకమైన ఫుడ్‌ కోర్టులు ఏర్పాటు చేయాలని చూస్తున్నారు అధికారులు. తెలంగాణ సాంప్రదాయ గిరిజన నృత్యాలు, ఇతర సాంస్కృతిక ప్రదర్శనలు పార్కులో ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే పూర్తిస్థాయి రిపోర్టులతో సిద్ధంగా ఉన్నామని, అనుకున్న మేరకు పనులు పూర్తయితే నగరవాసులకు నైట్‌ సఫారీ పార్కు  అందుబాటులోకి వస్తుందని హెచ్ఎండీఏ అధికారి ఒకరు తెలిపారు.

Related Posts