YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సర్పంచ్ లకు చెక్ పవర్లు

 సర్పంచ్ లకు చెక్ పవర్లు

రాష్ట్రంలోని సర్పంచ్‌లకు మరో పది రోజుల్లో చెక్‌పవర్ రాబోతున్నది. కొత్త పంచాయతీ చట్టం ప్రకారం ఈ అధికారం సర్పంచ్, ఉపసర్పంచ్‌లకే సంయుక్తంగా కల్పించారు. కానీ చట్టం అమలులో కొంత మేర కాలయాపన జరగడంతో రాష్ట్ర ప్రభుత్వం పాత చట్టం ప్రకారం చెక్ పవర్ అధికారాలను గ్రామ కార్యదర్శులకే అప్పగించింది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో వరసగా ఎన్నికలు జరగడం వల్ల సుమారు ఆరు నెలలు పాటు ఎన్నికల కోడ్ అమలులో ఉంది. దీంతో ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోయారని తెలుస్తోంది.ఇప్పుడు రాష్ట్రంలో మున్సిపల్ తప్ప మిగిలిన అన్ని రకాల ఎన్నికలు పూర్తి కావడంతో కెసిఆర్ పూర్తి స్థాయిలో పాలనపై దృష్టి సారించారు. ఇందులో భాగంగానే త్వరగా తమకు చెక్‌పవర్ ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్‌లు సిఎం కెసిఆర్‌ను, రాష్ట్ర పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును కలిసి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సిఎం కూడా వెనువెంటనే సుముఖతను కూడా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మరో వారం, పది రోజుల్లో సర్పంచ్‌లకు చెక్‌పవర్ కల్పిస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి శుక్రవారం స్వయంగా వెల్లడించారు. దీంతో చెక్‌పవర్ కోసం సర్పంచ్‌ల నిరీక్షణ త్వరలో
ఫలించబోతోంది.ఇంటింటికీ శుద్ధమైన తాగునీటి పంపిణీలో ఇబ్బందుల్లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో నీటి సరఫరాలో అవాంతరాలు ఉండొద్దని స్పష్టం చేశారు. మిషన్‌ భగీరథ పథకం కోసం కేంద్రం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు తెచ్చుకునేలా ప్రయత్నిద్దామని చెప్పారు. మిషన్‌ భగీరథ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ఇటీవల కేంద్ర ప్రభుత్వ సమావేశంలోనూ ఇతర రాష్ట్రాలు, కేంద్ర ప్రతినిధులు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారని చెప్పారు.  మిషన్‌ భగీరథ పనులు బాగా జరుగుతున్నాయి. ఇప్పటికే దాదాపుగా పూర్తయ్యాయి. మీ పని తీరువల్లే ఇది సాధ్యమైంది. మిగిలిపోయిన పనులను కూడా జూలై 15 లోపు పూర్తి చేసి ఇంకా మంచిపేరు తెచ్చుకోవాలి. కేసీఆర్‌ ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ భగీరథ ఎంతో గొప్పది. టీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ఇదే. నా 33 ఏళ్ల రాజకీయ అనుభవంతో చెబుతున్నా. ఎప్పుడు ప్రచారానికి వెళ్లినా బిందెలు, కుండలతో నీళ్ల కోసం మహిళలు ఎదురుపడేవారు. మిషన్‌
భగీరథతో ఇలాంటి పరిస్థితి లేకుండా పోయింది.ప్రతి గ్రామంలో తాగునీటి సరఫరా విషయంలో ప్రభుత్వంపై సానుకూలత ఏర్పడింది’అని మంత్రి అన్నారు. గ్రామాల్లో తాగునీటి సరఫరా ప్రక్రియను మరింత పటిష్టం చేయాలని, వారం, పది రోజుల్లో సర్పంచ్‌లకు చెక్‌పవర్, అధికారాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ‘గ్రామపంచాయతీ నిధులతో వాటర్‌ట్యాంకుల మరమ్మతు పనులు చేయించండి. సర్పంచ్‌లతో సమన్వయం చేసుకుంటూ వేగంగా పనులు పూర్తి అయ్యేలా చూడండి.

Related Posts