YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నిధుల కోసం గళం విప్పండి ఎంపీలకు జగన్ దిశానిర్దేశం

నిధుల కోసం గళం విప్పండి ఎంపీలకు జగన్ దిశానిర్దేశం

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

జూన్ 17 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతోన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం శనివారం నిర్వహించారు. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు, రాష్ట్ర సమస్యలను సామరస్యపూర్వకంగా కేంద్రం దృష్టికి ఎలా తీసుకెళ్లాలన్నదానిపై చర్చించారు. వైసీపీ తరఫున ఎన్నికైన ఎంపీల్లో ఎక్కువ మంది కొత్తవారు కావడంతో రాష్ట్రానికి సంబంధించిన అంశాలను సభలో ఏవిధంగా లేవనెత్తాలన్న అంశంపై సీఎం జగన్‌ దిశానిర్దేశం చేశారు. సభ్యులంతా పార్లమెంటుకు తప్పనిసరిగా హాజరుకావాలని, ప్రత్యేక హోదా గురించి లోక్‌సభలో అడుగుతూనే ఉండాలని ఆయన పేర్కొన్నారు. అలాగే మీడియా ముందు మాట్లాడేటప్పుడు సంయమనం కోల్పోరాదని సూచించారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు ఎప్పటికప్పుడు సభలో గళం వినిపించాలని, ఈ విషయంలో ఏకతాటిపై ఉండాలని ఆదేశించారు. సమావేశం అనంతరం బయటకు వచ్చిన వైసీపీ ఎంపీలు మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా విషయమై భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. రాష్ట్రం హక్కుల సాధనకు పార్లమెంటులో పోరాడుతామని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కోసం గాంధీ విగ్రహం ముందు నిరసన తెలియజేస్తారా? అని ఓ విలేకరి ప్రశ్నించగా ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలేదని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ వ్యాఖ్యానించారు.
జగన్ తో కుమారస్వామి భేటీ కర్ణాటక సీఎం కుమారస్వామి.. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో శనివారం మధ్యాహ్నం ఇరువురు నేతలు భేటీ అయ్యారు. తనను కలవడానికి వచ్చిన కర్ణాటక ముఖ్యమంత్రిని సీఎం వైఎస్ జగన్.. శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు తాజా రాజకీయ అంశాలు, నదీ జలాల వివాదాల పరిష్కారం, రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకునే అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. కర్ణాటక సీఎం కుమారుడు నిఖిల్ గౌడ ఇటీవల అమరావతిలో సీఎం జగన్‌ను కలిసిన సంగతి తెలిసిందే. తమ లాంటి యువకులకు జగన్ స్ఫూర్తి అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరుగుతున్న నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యే నిమిత్తం ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్.. శనివారం ఉదయం ఏపీ భవన్‌లో వైఎస్సార్‌సీపీ ఎంపీలతో సమావేశమయ్యారు. పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అనంతరం సీఎం అధికారిక నివాసంలో విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు సీఎం కుమారస్వామి హాజరైనట్లు తెలుస్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జగ‌న్ మోహ‌న్ రెడ్డి గారిని ఢిల్లీలో రోడ్ నం-1 జ‌న్‌ప‌త్‌లోని నివాసంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసిన కర్నాట‌క సీఎం శ్రీ హెచ్‌డీ కుమార‌స్వామి.పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు కొనసాగించే దిశగా సీఎం వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారు. భారీ మెజార్టీతో ఏపీలో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్.. మే 30న అమరావతిలో నిర్వహించిన ప్రమాణ స్వీకారోత్సవానికి తెలంగాణ సీఎం కేసీఆర్, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ను ముఖ్య అతిథులుగా ఆహ్వానించిన విషయం తెలిసిందే.కాగా, ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో విందును ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దీనికి కర్ణాటక సీఎం కుమారస్వామిని ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని మన్నించిన కుమారస్వామి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎంపీలతో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు. కాగా, ఈ భేటీలో ఏపీ, కర్ణాటకకు లబ్ధి చేకూర్చే అంశాలపై ఇరువురు సీఎంలు కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందని వైసీపీ వర్గాలు వెల్లడించాయియి. ఈ విషయంలో ఇరురాష్ట్రాల సీఎంలు కలసికట్టుగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తారని పేర్కొన్నాయి. శనివారం సాయంత్రం జరిగే నీతి అయోగ్ సమావేశంలో జగన్ సహా పలు రాష్ట్రాలు సీఎంలు పాల్గొననున్నారు.

Related Posts