YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

డిల్లీలో ఏపీ సీఎం జగన్ విందు రాజకీయం.. హాజరైన కర్ణాటక సిఎం

డిల్లీలో ఏపీ సీఎం జగన్ విందు రాజకీయం.. హాజరైన కర్ణాటక సిఎం

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో విందును ఏర్పాటు చేసిన జగన్.. దీనికి కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామిని ఆహ్వానించారు.ఈ ఆహ్వానాన్ని మన్నించిన కుమారస్వామి జగన్ ఇంటిలో జరుగుతున్న విందు భేటీకి హాజరు అయ్యారు. ఈ కార్యక్రమంలో వైసీపీ లోక్ సభ, రాజ్యసభ సభ్యులతో పాటు పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. కాగా, ఈ భేటీలో ఏపీ, కర్ణాటకకు లబ్ధి చేకూర్చే అంశాలపై ఇరువురు నేతలు కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందని వైసీపీ వర్గాలు చెప్పాయి. ఈ విషయంలో ఇరురాష్ట్రాల సీఎంలు కలసికట్టుగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తారని పేర్కొన్నాయి.అంతకు ముందుపార్లమెంటు సమావేశాల నేపథ్యంలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని జగన్ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై వైసీపీ సభ్యులకు దిశానిర్దేశం చేశారు.రాష్ట్ర సమస్యలపై పార్లమెంటులో సామరస్య పూర్వక ధోరణిలో మన వాణి వినిపించాలని ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జగన్‌ ఈరోజు ఏపీ భవన్‌లో పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంటు ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. రాష్ట్ర సమస్యలపై రాజీ పడకుండా మన గళం వినిపించాలని, అవసరమైన హక్కులను సాధించేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. ఎక్కువ మంది సభ్యులు కొత్తవారు కావడంతో వారికి పలు అంశాలు వివరించారు. ఇంకా సమావేశం కొనసాగుతుండగా పలు అంశాలపై సభ్యులతో జగన్ చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి లోక్‌సభా పక్షం నేత మిధున్‌రెడ్డితోపాటు పార్టీ ఎంపీలంతా హాజరయ్యారు.

Related Posts