YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జమిలీతో జగన్ ముందస్తుకేనా

జమిలీతో జగన్  ముందస్తుకేనా

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

జగన్ మోహన్ రెడ్డి ది పదేళ్ళ రాజకీయ పోరాటం. అంతే సమానమైనది ఆయన కన్నకల. ప్రజలకు ముఖ్యమంత్రిగా ఏదే చేద్దామన్న తపన జగన్ని తిరుగులేని రాజకీయ నాయకున్ని చేసింది. తండ్రి వైఎస్సార్ బాటలో తాను కూడా మంచి పేరు తెచ్చుకోవాలని జగన్ గట్టి ఆలోచన చేశారు. నిజానికి జగన్ కి పదేళ్ళ క్రితమే సీఎం సీటు వూరించింది. అయితే నాడు తొలిసారి తప్పిపోయింది. ఆ తరువాత 2014 ఎన్నికల్లో దగ్గరలోకి వచ్చి చాన్స్ మిస్ అయింది. ఇక మూడవసారి మాత్రం ముచ్చట తీర్చింది. అలా ఇలా కాదు బంపర్ మెజార్టీతో జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. అన్ని రికార్డులు బద్దలు కొట్టారు. మొత్తానికి మొత్తం అసెంబ్లీ సీట్లను కైవశం చేసుకున్నారు. ఇపుడు జగన్ అయిదేళ్ల కాలానికి సరిపడా ప్రణాళికలు వేసుకుని ముందుకు సాగుతున్నారుఇక కేంద్రంలోకి బీజేపీకి జమిలి ఎన్నికల సరదా పోలేదు. ఒకే దేశం, ఒకే ఎన్నిక అన్నది కమలం పార్టీ సిధ్ధాంతంగా ఉంది. తొలిసారి అధికారంలోకి వచ్చినపుడే ఈ ప్రయోగానికి తెర తీసినా అప్పట్లో కుదరలేదు. ఇపుడు మంచి మెజారిటీతో రెండవమారు అధికారంలోకి రావడంతో మోడీ షా ద్వయం మళ్ళీ జమిలి అజెండాను ముందుకు తెచ్చారు. ఈ మధ్యనే దానికి సంబంధించి అఖిల పక్ష సమావేశం ఏర్పాటు
చేశారు. లోక్ సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిపించాలని బీజేపీ దాదాపుగా డిసైడ్ అయింది. ఇందుకోసం ఇపుడు అధికారంలో ఉన్న అసెంబ్లీల కాలపరిమితి 2022 వరకూ పొడిగించడం, అప్పటికి పదవీకాలం ఉన్న్ వాటిని కుదించడం. మొత్తం 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలుపుకుని ఒకెసారి ఎన్నికలు 2022 లో జరిపించాలని వేగంగా బీజేపీ ఆద్వర్యంలోని మోడీ సర్కార్ అడుగులు వేస్తోంది. అదే జరిగితే జగన్ మోహన్ రెడ్డి రెండేళ్ళ అసెంబ్లీ కాలాన్ని దారుణంగా కోల్పోతారు. నిజానికి షెడ్యూల్ ప్రకారం 2024లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగాలి.నిజానికి జమిలి ఎన్నికలు అంటే కేంద్ర ప్రభుత్వ అజెండా ముందుకు వచ్చి ప్రాంతీయ పార్టీలు కొట్టుకుపోతాయన్నది మోడీ షా ల ఆలోచన. అయితే అక్కడ రాష్ట్రాల్లో బీజేపీ బలంగా ఉన్నపుడే ఇది సాధ్యపడుతుంది. ఏపీలో చూసుకుంటే ఇప్పటి నుంచే ఫిరాయింపులు అమలు చేస్తూ బలపడాలని కమలం నేతలు చూస్తున్నారు. మరో వైపు టీడీపీకి ఇలా అయిదేళ్ళ ప్రతిపక్ష కాలం మూడేళ్లకు కుదించడం అంటే లాభమే. ఎందుకంటే తొందరలోనే ఎన్నికలు పెడితే తాము రాజకీయంగా లాభపడొచ్చన్నది ఆ పార్టీ ఆలోచన. ఇక వైసీపీకి మాత్రం నష్టమేనని అంటున్నారు. మళ్ళీ ఎన్నికలు పెడితే ఇంతటి మెజారిటీ వస్తుందో రాదో ఎవరూ చెప్పలేరు. ఇక అనుకున్న పధకాలు అమలు జరిగి తిరిగి జనం వద్దకు వెళ్ళి ఓట్లు అడగాలని జగన్ అనుకుంటున్నారు. ఇలా అర్ధాంతరంగా ఎన్నికలు పెడితే జగన్ మోహన్
రెడ్డి ప్లాన్ అంతా పక్కదారి పడుతుంది. అపుడు జనం ఎలా రియాక్ట్ అవుతారో. మొత్తానికి జమిలి ఎన్నికల ముప్పు జగన్ మోహన్ రెడ్డి కి కొత్త తిప్పలు తెచ్చిపెట్టేలా ఉంది.

Related Posts