YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

వృధా అవుతున్న నీరు చోద్యం చూస్తున్న అధికారులు...

 వృధా అవుతున్న నీరు   చోద్యం చూస్తున్న అధికారులు...

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

మండల కేంద్రమైన గోపాల్ పేట లో ఒకపక్క మంచినీటి సరఫరా కాక ప్రజలు అవస్థలు పడుతుంటే మరోపక్క గ్రామం వెలుపల ఉన్న బోర్ దగ్గర నీరు వృథా కావడం పట్ల ప్రజలు తీవ్రస్థాయిలో విమర్శించారు. నీటిని పొదుపుగా వాడుకోండి ముందు తరాల వారికి ఆదర్శంగా నిలబడని అధికారులు. నాయకులు అంటున్నారే తప్ప దీనిపై చర్యలు తీసుకునేది ఎవరని వారు ప్రశ్నించ సాగారు. గ్రామంలో మంచినీటి నివారణ కోసం గ్రామం వెలుపల ఉన్న వాగులో బోరును వేసి మోటర్ అమర్చారు. కాగా మోటర్ అమర్చిన నుంచి పైపుల గుండా నీరు వృధా అ యి కాలువలో పారుతున్నాయి. ఈ పరిస్థితి నెలకొని కొన్ని ఏళ్లుగా జరుగుతున్న కూడా ఎవరు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం వల్ల ప్రజలు ఆగ్రహావేశాలు వెలిబుచ్చుతున్నారు. గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించండి అని పలువురు వాట్సాప్ లో అధికారులకు. నాయకుల కు తెలపడం వంటివి జరుగుతున్నాయి. అయినా కూడా వారు ఏ మాత్రం స్పందించక వృధా అవుతున్న నీటిపై ఎటువంటి చర్యలు చేపట్టక పోవడం వల్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related Posts