YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

గ్రామ పంచాయతీలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలి. జిల్లా కలెక్టర్.డాక్టర్ ఏ.శరత్

 గ్రామ పంచాయతీలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలి. జిల్లా కలెక్టర్.డాక్టర్ ఏ.శరత్

గ్రామ పంచాయతీలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని అధికారులకు జగిత్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్. ఏ.శరత్ సూచించారు. ముఖ్యమంత్రి  స్వచ్ఛ హరిత గ్రామం కార్యక్రమంపై గురువారం స్థానిక దేవిశ్రీ గార్డెన్ లో గ్రామ పంచాయతీ సెక్రటరీలు ,ఈవోపిఆర్డి, ఎంపీడీవో ,ప్రత్యేక అధికారులు, క్లస్టర్ అధికారులు జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.శరత్  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ ఏ.శరత్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని అన్నారు.ముఖ్యమంత్రి  స్వచ్ఛ హరిత గ్రామంలో భాగంగా ప్రతి మంగళవారం గ్రామ పంచాయతీలలో నిర్వహించే పరిశుభ్రత, పచ్చదనం కార్యక్రమంను ఒక ఉద్యమంగా పంచాయతీ సెక్రటరీలు, అధికారులు సమిష్టిగా పని చేయాలని అన్నారు. గ్రామాల్లో ప్రతిరోజు ఇంటి నుండి  ట్రై సైకిల్ ద్వారా తడి చెత్తను ,పొడి చెత్తను వేరు వేరుగా సేకరించి డంపింగ్ యార్డ్ లకు తరలించాలని, గ్రామాల్లో చిన్న రిపేర్ లు ఉన్న టాయిలెట్లను బాగు చేయించి వాడుకలోకి తీసుకురావాలని, పిచ్చి మొక్కలు, ముళ్ళపొదల ను తొలగించాలని, ఇళ్ళల్ల్లోని వృధా నీరు రోడ్లపైకి రాకుండా ఇంకుడు గుంతల నిర్మాణాలు జరిగేలా ప్రజలను చైతన్యపరచాలని అన్నారు. ప్రతి మంగళవారం నిర్వహించే కార్యక్రమం గురించి ఒక రోజు ముందుగానే దండోరా ద్వారా తెలియజేయాలని అని పేర్కొన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు,శ్రమదానం కార్యక్రమాలలో భాగంగా మురికి కాల్వలను శుభ్ర పరచాలని, నిరుపయోగంగా ఉన్న బోరుబావులను పూడ్చివేయాలన్నారు  వీధి నల్లాలు బోరు బావులు మినరల్ వాటర్ ప్లాంట్ ల వద్ద కమ్యూనిటీ ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రతి గ్రామంలో బహిరంగ మల విసర్జన చేసిన, రోడ్లపై చెత్తను పారవేసిన కనీసం రూ 500 నుండి 5000 వరకు జరిమానా విధించబడుతుందని హెచ్చరించాలని సూచించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామ పరిధిలో మూడు కిలో మీటర్ల రహదారులకు 1.5 మీటర్లు సైజు గల మొక్కలు నాటాలని, హరిత నర్సరీల ద్వారా గ్రామంలోని ప్రతి ఇంటికి 6 నుండి 10 వరకు పూల మరియు పండ్ల మొక్కలు పంపిణీ చేసి నాటించాలని, పొలం గట్ల వద్ద ఆదాయాని ఇచ్చే మొక్కలు నాటుకునేలా రైతులను ప్రోత్సహించాలని అన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలోని కాళీ పోరంబోకు స్థలాలు రెవెన్యూ బుట్టలు ఎస్సారెస్పీ ఎస్సారెస్పీ కాలువ గట్లు, వైకుంఠ దామాలలో మొక్కలు నాటి వాటి వారి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో నాటిన మొక్క లో కనీసం 85 శాతం వరకు బ్రతికి ఉండేలా మహిళా సంఘాలు స్వచ్ఛంద సంస్థలు ,యువజన సంఘాల వారు సంరక్షణ బాధ్యతలు వహించాలన్నారు .ప్రతి గ్రామ పంచాయతీలో పంపిణీ చేయగా నాటిన మొక్క లకు సంబంధించి హరితహారం రిజిస్టర్లను నిర్వహించాలని తెలిపారు. కార్యక్రమ పర్యవేక్షణ కొరకు గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శి వి ఆర్ ఓ మండలానికి ఒక ప్రత్యేక అధికారిని ప్రతి మూడు మండలాలకు ఒక సీనియర్ అధికారిని నియమించినట్లు పేర్కొన్నారు.
అనంతరం వివాహ నమోదు చట్టం 2002 గోడ ప్రతిని జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని కుల, మత వర్గాల వారికి ఒకే విధానమైనా వివాహ నమోదు ధ్రువీకరణలను పొందాలని అన్నారు. గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులకు నగరాలలో మున్సిపల్ కమిషనర్లకు వివాహ నమోదు అధికారాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు  పెళ్లి జరిగిన 30 రోజులలో వివాహ ధ్రువ పత్రం కొరకు దరఖాస్తు చేసినచో ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని, 60 రోజుల సమయంలో రూపాయలు 100 చెల్లించి వివాహ ధ్రువపత్రాన్ని పొందవలసి ఉంటుందని పేర్కొన్నారు .వివాహ నమోదు ధ్రువీకరణ కొరకు వధువుకు 18 సంవత్సరాలు, వరునికి 21 సంవత్సరాలు నిండి ఉండాలని అని దీని ద్వారా బాల్య వివాహాలు రుజువులు లేని పెళ్లిళ్లు అరికట్టవచ్చని ప్రభుత్వ పథకాల లబ్ధి మొదలగు వాటికి ఉపయోగపడతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి శేఖర్, పి డి,డి ఆర్ డీ ఓ బిక్షపతి, జెడ్ పి ఏవో శ్రీలత రెడ్డి, పశు సంవర్ధక శాఖ అధికారి జయాకర్ ఇతర జిల్లా అధికారులు లు ఎంపీడీవోలు గ్రామ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts