YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మండలంలో ప్రారంభమైన వాలంటీర్ల ఇంటర్వ్యూలు

మండలంలో ప్రారంభమైన వాలంటీర్ల ఇంటర్వ్యూలు

మండల కేంద్రమైన తుగ్గలిలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయం నందు మొదటిరోజు వాలంటీర్ల ఇంటర్వ్యూలను అధికారులు నిర్వహించారు.మొదటి టీమ్ ఆధ్వర్యంలో ఎంపీడీవో వీర రాజు మరియు తహసిల్దార్ నిజాముద్దీన్ లు దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు,అదేవిధంగా రెండవ టీమ్ ఆధ్వర్యంలో తుగ్గలి మండల స్పెషల్ ఆఫీసర్ రామ్మోహన్,అగ్రికల్చర్ ఆఫీసర్ కృష్ణ కిషోర్ రెడ్డి,ఆర్డబ్ల్యూఎస్ ఏఈ సత్యనారాయణ మూర్తి దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు.మొదటి రోజైన ఇంటర్వ్యూల్లో ఎల్లమ్మ గుట్ట తాండ,మిట్ట తాండ,చిగురులు గుట్ట తాండ,సూర్య తాండ మరియు రాంపురం గ్రామాలకు చెందిన దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలు నిర్వహించామని తెలియజేశారు.శుక్రవారం రోజున గిరిగేట్ల,రాంపురం,రాంకొండ మరియు ఉప్పరపల్లె గ్రామానికి చెందిన దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తామని తెలియజేశారు.

Related Posts