YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాల్లో కింగ్ నాగార్జున‌ `మ‌న్మ‌థుడు 2`.. ఆగ‌స్ట్ 9న గ్రాండ్ రిలీజ్‌

డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాల్లో కింగ్ నాగార్జున‌ `మ‌న్మ‌థుడు 2`.. ఆగ‌స్ట్ 9న గ్రాండ్ రిలీజ్‌

యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:

కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్‌గా న‌టిస్తోన్న చిత్రం `మ‌న్మ‌థుడు 2`. మ‌నం ఎంట‌ర్ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్స్‌, వ‌యకామ్ 18 స్టూడియోస్ ప‌తాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్(జెమిని కిర‌ణ్‌) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతోన్న ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ షూటింగ్ పూర్త‌య్యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఇప్పుడు డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. అందులో భాగంగా హీరో నాగార్జున డ‌బ్బింగ్ చెబుతున్నారు.  అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఆగ‌స్ట్ 9న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది.
ఇటీవ‌ల విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే అవంతికగా న‌టించిన ర‌కుల్ ప్రీత్ సింగ్ పాత్ర‌కు సంబంధించిన ట‌జీర్‌ను విడుద‌ల చేశారు. ఈ టీజ‌ర్‌కు కూడా హ్యూజ్ రెస్పాన్స్ వ‌చ్చింది.  చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆడియో విడుద‌ల‌, ట్రైల‌ర్ రిలీజ్ డేట్స్‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు తెలియ‌జేశారు.

Related Posts