YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఆసరా తో ఆత్మవిశ్వాసం పెంచాం...ఆత్మీయ బందాన్ని పంచాం...

ఆసరా తో ఆత్మవిశ్వాసం పెంచాం...ఆత్మీయ బందాన్ని పంచాం...

ఆసరా తో ఆత్మవిశ్వాసం పెంచాం. ఆత్మీయ బందాన్ని పంచాం. పెన్షన్ లను పెంచి పేదల్లో ఆత్మగౌరవాన్ని మరింత పెంచాం. ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి పెంచిన పెన్షన్లు ఇస్తున్నామని మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు గారు అన్నారు. సిద్దిపేట మున్సిపాలిటీ లో ప్రశాంత్ నగర్ , గణేష్ నగర్ , అంబెడ్కర్ నగర్ లో పలు వార్డులో పెరిగిన పిన్షన్ ల మంజూరు పత్రాలని పంపిణీ చేసారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ  పేదల కష్టాలు తెల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్ , ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం వెయ్యి రూపాయల నుండి 2016 , 1500 నుండి 3016రూపాయలు పెంచి పేదల గుండెల్లో కేసీఆర్ ఒక ఆసరాగా నిలుస్తున్నాడన్నారు. ఆరు నెలల నుండి ఎన్నికల కోడ్ వల్ల ఈ కార్యక్రమం ఆలస్యం అయిందని చెప్పారు.  పెరిగిన పెన్షన్ వల్ల పేదల ఆత్మగౌరవం కాపాడుదామన్నారు. వికలాంగులకు 3016 రూపాయల వల్ల కొండంత అండగా దేశంలోని 29 రాష్ట్రాలలో130 కోట్ల జనాభా లో 2016రూపాయల పెన్షన్ ఇస్తున్నది ఎకైక ముఖ్యమంత్రి కేసీఆర్  మాత్రమేన్నారు. పెన్షన్ దేశంలో ఎక్కడ లేదు, ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు. సీఎం కేసీఆర్ కి తృప్తి ని ఇచ్చిన పథకం ఈ పథకం అని వెల్లడించారు.  57 ఏండ్లు నిండిన
వారికి, కొత్త గా పి ఎఫ్ వచ్చిన బీడీ కార్మికులను గుర్తించి పెరిగిన పెన్షన్లు అందిస్తామని త్వరలోనే సిద్దిపేట లో నిర్మిస్తున్న డబుల్ బెడ్రోమ్ ఇల్లు నిజమైన పేదలకు ఇస్తామని చెప్పారు.  సిద్దిపేట పట్టణము లో ప్రతి నెల 13857 మందికి , 2,88 కోట్లు ఆసరా పిన్షన్ లు ఇస్తున్నామని చెప్పారు.  

Related Posts